సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదం! తల్లి బిడ్డ మృతి  

కన్నడ సినిమా షూటింగ్ లో పేలిన గ్యాస్ సిలిండర్. ఇద్దరు మృతి. .

2 People Dead In Movie Shooting In Bangalore-

కన్నడ సినిమా షూటింగ్ లో దారుణం చోటు చేసుకుంది.ప్రముఖ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా అక్కడ స్టార్ హీరోలలో ఒకడిగా ఉన్నాడు.తాజాగా చిరంజీవి కొత్త సినిమా రణం షూటింగ్ బెంగుళూరు సిటీలో జరుగుతుంది..

2 People Dead In Movie Shooting In Bangalore--2 People Dead In Movie Shooting Bangalore-

అయితే ఈ షూటింగ్ లో ఊహించని విధంగా సిలిండర్ పేలి అగ్నిప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో తల్లి బిడ్డ మరణించినట్లు తెలుస్తుంది.

సమీపంలో షూటింగ్ జరుగుతుందని సమాచారంతో సయేసా బాను అనే మహిళా షూటింగ్ చూడటానికి తన ఐదేళ్ల చిన్నారితో వెళ్లింది.

ఆ సమయంలో కారును బ్లాస్ట్‌ చేసే దృశ్యాలను దర్శకుడు తీస్తున్నారు.ఈ క్రమంలో హఠాత్తుగా సిలిండర్‌ పేలడంతో సంఘటన స్థలంలో ఉన్న సయేసా బాను, ఆమె కూతురు మరణించారు.మరో చిన్నారి తీవ్రంగా గాయపడింది.

ఈ సంఘటన జరిగిన వెంటనే షూటింగ్ ని ఆపేసి వారిని హాస్పిటల్ కి తీసుకెళ్ళారు.దీనిపై చిత్ర యూనిట్ మీద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ప్రమాదం జరగగానే చిత్ర యూనిట్ మొత్తం అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తుంది.అయితే సినిమాలో మరో నటుడు చేతన్ పోలీసులని కలిసి సంఘటన గురించి తెలియజేయడంతో పాటు హాస్పిటల్ లో ఉన్న చిన్నారిని పరామర్శించాడు.

అలాగే ఈ సంఘటన గురించి తెలుసుకున్న చిరంజీవి తాను షూటింగ్ లో పాల్గోలేదని, అయితే సంఘటన తనని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది అని తెలియజేసారు.చనిపోయిన వారి కుటుంబానికి సాయం చేస్తా అని చెప్పుకొచ్చారు.