2.ఓ 5 రోజుల కలెక్షన్స్‌.. ఇలా అయితే కష్టమే  

రోజులు గడుస్తునాన కొద్ది 2.ఓ సినిమా కలెక్షన్స్‌ తగ్గుతూ వస్తున్నాయి. ఆదివారం తర్వాత కలెక్షన్స్‌ చాలా డ్రాప్‌ అయ్యాయి. సినిమాను రెండు వర్షన్‌లలో విడుదల చేసిన చిత్ర యూనిట్‌ సభ్యులు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని మాత్రం అందుకోవడంలో విఫలం అయ్యిందని చెప్పుకోవాలి. ఎన్నో బారీ చిత్రాలు చేసి భారీ వసూళ్లు రాబట్టిన దర్శకుడు శంకర్‌ ఈసారి కూడా భారీ వసూళ్లు అయితే రాబడుతున్నాడు కాని, అవి పెట్టిన పెట్టుబడితో పోల్చితే సరిపోవడం లేదు. 550 కోట్ల బడ్జెట్‌ మూవీకి కనీసం సగం కలెక్షన్స్‌ అయినా వచ్చేనా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

2.o Movie Five Days Collections-Akshay Kumar Amey Jackson Director Shankar Rajani Kanth

2.o Movie Five Days Collections

2.ఓ మూవీ 5 రోజుల కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయో కింద చూడండి :
ఏరియా కలక్షన్స్
నైజాం 15.08 కోట్లు
సీడెడ్ 5.68 కోట్లు
నెల్లూరు 1.45 కోట్లు
గుంటూరు 2.76కోట్లు
కృష్ణా 2.17కోట్లు
పశ్చిమ గోదావరి 1.85కోట్లు
తూర్పు గోదావరి 2.69 కోట్లు
ఉత్తరాంధ్ర 4.67 కోట్లు
ఏపీ, తెలంగాణ లో ఐదు రోజుల షేర్ 36.35 కోట్లు

ఏపీ + తెలంగాణా: 36.35 కోట్లు

తమిళ నాడు: 35.12 కోట్లు
కేరళ: 5.67 కోట్లు

కర్ణాటక: 11.28 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా: 52.66 కోట్లు

ఇండియా టోటల్: 140.81 కోట్లు షేర్

ఈ కలెక్షన్స్‌ డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తెచ్చి పెట్టడం అసాధ్యం. ఇదే తరహాలో కలెక్షన్స్‌ వస్తే మాత్రం డిస్ట్రిబ్యూటర్లు నిండా మునిగినట్లే అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. నిర్మాతలు సేఫ్‌ అయినా డిస్ట్రిబ్యూటర్లు మాత్రం కుదేలే అంటూ తమిళనాట ప్రచారం జరుగుతోంది.