చెవిలో వేయాల్సిన మందుని నోట్లో వేసిన నర్స్.... ఏమైందంటే...

ప్రస్తుత కాలంలో కొందరు చేసేటువంటి చిన్నపాటి నిర్లక్ష్యం మరొక్కరి జీవితాల్లో తీవ్ర విషాదం నింపుతోంది.తాజాగా ఓ నర్స్ చేసినటువంటి చిన్నపాటి తప్పిదానికి రెండు నెలల బాలుడు మృతి చెందిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
  వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాలోని శంకరపల్లి ప్రాంతానికి చెందినటువంటి ఇద్దరు దంపతులకు రెండు నెలల బాలుడు ఉన్నాడు.అయితే ఇటీవల కాలంలో బాలుడు కొంతమేర శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు.

 2 Months Old Baby Boy In Rangareddy District-TeluguStop.com

ఇది గమనించిన ఇటువంటి బాలుడు తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకొచ్చారు.అయితే బాలుడి సమస్యలు తెలుసుకున్నటువంటి వైద్యులు నర్స్ కి యాంటీబయాటిక్స్ ని ఇవ్వమని సలహా ఇచ్చారు.

దీంతో నర్సు అవగాహన లేమి కారణంగా చెవిలో వేయాల్సినటువంటి వ్యాక్సిన్ ని పొరపాటుగా నోట్లో వేసింది.దీంతో బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యా డు.వెంటనే అప్రమత్తమై నటువంటి బాలుడు తల్లిదండ్రులు మళ్లీ చికిత్స నిమిత్తం హైదరాబాదులో ఉన్నటువంటి ఓ ప్రముఖ ఆసుపత్రికి తీసుకురాగా ఊపిరితిత్తులు దెబ్బతినడంతో అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు.

Telugu Baby Boy, Ranga, Ranga Latest-Telugu Crime News(క్రైమ్ వా

దీంతో బాలుడు తల్లిదండ్రులు వెంటనే మొదట చికిత్స చేసినటువంటి ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు నిర్లక్ష్యంగా తమకు ఎటువంటి సంబంధం లేదని ఆసుపత్రి అధికారులు చెబుతుండంతో ఆగ్రహానికి గురయ్యారు.అంతేగాక ఆసుపత్రి లో ఉన్నటువంటి కుర్చీలు, టేబుళ్లు, ఆంబులెన్స్ అద్దాలు పగలగొట్టారు.అలాగే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు నమోదు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube