కరోనా డేంజర్ బెల్స్: ఆ పది దేశాల్లో 2 మిలియన్ల మంది భారతీయులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కాటు దెబ్బకి అనేక దేశాలు విలవిలలాడుతున్నాయి.ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలో ఆయా లాక్‌డౌన్‌లు, సరిహద్దు మూసివేతలతో పాటు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేశాయి.

 2 Million Nris Residing In 10 Countries Hit By Coronavirus-TeluguStop.com

దీంతో వివిధ దేశాల్లో విద్య, ఉపాధి కోసం ఖండాలు దాటి వెళ్లిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ లిస్ట్‌లో భారతీయులు ఉన్నారు.

వీరిలో కొందరు తాత్కాలికంగా వెళ్లినవారైతే, శాశ్వతంగా అక్కడే స్థిరపడిన వారు లక్షల్లో ఉన్నారు.ప్రస్తుతం స్వదేశానికి వెళ్లే పరిస్ధితి లేకపోవడంతో వారు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు.

కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం పలు దేశాల్లో ఉన్న భారతీయులకు ఇప్పటికే వైరస్ సోకింది.ఐక్యరాజ్యసమితి గణాంకాలను బట్టి భారత్ నుంచి లక్షలాది మంది వలసవెళ్లి వివిధ దేశాల్లో స్థిరపడ్డారు.

ఈ లిస్ట్‌లో ప్రపంచంలో మనమే నెంబర్‌వన్.మొత్తం 17.5 మిలియన్ల మంది భారతీయ వలసదారులు పలు దేశాల్లో స్థిరపడ్డారు.ఇది ప్రపంచ జనాభాలో 6 శాతానికి సమానం.

Telugu Coronavirus, Indian Nris-

కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ 2018 డిసెంబర్‌‌లో విడుదల చేసిన వివరాల ప్రకారం.13 మిలియన్ల మంది ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు, భారతీయ పాస్‌పోర్ట్ కలిగి ఉన్నవారు.కానీ వీరు సాధారణంగా భారత్‌కు వెలుపల నివసిస్తున్నారు) అలాగే 18 మిలియన్ల మంది భారతీయ మూలాలు ఉన్నవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు.(పీఓఐ, భారతీయ పూర్వీకులు, విదేశీ పాస్‌పోర్ట్ కలిగి ఉన్నవారు).

వైరస్ వ్యాప్తి దృష్ట్యా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల్లో మనదేశానికి రప్పించింది.ఇదే సమయంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న 10 దేశాల్లో కనీసం 15 శాతం మంది ఎన్ఆర్ఐలు నివసిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇందులో చైనా, అమెరికా, ఇటలీ, ఇరాన్, స్పెయిన్, జర్మనీ వంటి దేశాలున్నాయి.అలాగే 100 కంటే ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదైన దేశాల్లో 86 శాతం మంది భారతీయులు నివసిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube