రైలు పట్టాలపై కూర్చుని పబ్‌జీ ఆడారు... లోకాన్ని మర్చి ఆటలో మునిగిన వారు లోకాన్ని వదిలి వెళ్లారు

ఈమద్య కాలంలో పబ్‌జీ గేమ్‌ గురించి మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి.పబ్‌జీ గేమ్‌ వల్ల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, హత్యలు జరుగుతున్నాయని రకరకాలుగా ప్రచారం జరుగుతుంది.

 2 Men Playing Pubg Run Over By Train In Maharashtra Dead-TeluguStop.com

ఆన్‌ లైన్‌లో పబ్‌జీ గేమ్‌ ఆడేవారు ఒకరిపై ఒకరు కోపాలు పెంచుకుంటున్నారు.ముఖ్యంగా స్నేహితులు ఆన్‌లైన్‌లో పబ్‌జీ గేమ్‌ ఆడుతూ ఒకరిపై ఒకరు పరమ విరోదం పెంచుకుంటారు.

ఆటలోని సంఘటనలు వారిలో బలంగా ముద్రించబడటంతో ఆ తర్వాత బౌతిక దాడులకు పాల్పడుతున్నారు.ఆన్‌ లైన్‌ లో ఇతరులతో కలిసి పబ్‌జీ గేమ్‌ ఆడుతున్న సమయంలో చుట్టు పక్కల ఏం జరుగుతుందో అనే విషయాన్ని కూడా మర్చి పోయి జనాలు ఆడుతున్నారు.

తాజాగా ఇద్దరు స్నేహితులు పబ్‌జీ గేమ్‌ ఆడుతూ చుట్టు ఏం జరుగుతుందో అనే విషయాన్ని పట్టించుకోలేదు.దాంతో వారు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… మహారాష్ట్రలోని హింగోళీకి చెందిన నగేష్‌ గోరె మరియు స్వప్నీల్‌ అన్నపూర్ణే అనే ఇద్దరు యువకులు ఊరు చివర ఉన్న రైల్వే ట్రాక్‌ పై కూర్చుని పబ్‌బీ గేమ్‌ ఆడుకుంటున్నారు.వారిద్దరి ఆటలో పడి టైం మర్చి పోయారు.అసలు ఆడుతున్న సమయంలో రైలు వస్తున్న విషయాన్ని కూడా గమనించలేదు.దాంతో వారిద్దరిని రైలు ఢీ కొట్టింది.ఇద్దరి మృత దేహాలు చెల్ల చెదురై పడి ఉన్నాయి.

వారి ద్దరు కూడా పబ్‌ జీ గేమ్‌ ఆన్‌లైన్‌లో ఆడుతున్నట్లుగా పోలీసులు నిర్థారించారు.ఆన్‌లైన్‌లో ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం పబ్‌జీ గేమ్‌ ఆడుతున్న సమయంలో ఈ సంఘటన జరిగిందని, గేమ్‌లో బాగా ఇన్వాల్వ్‌ అయిన కారణంగా వారు రైలు వచ్చే విషయాన్ని గమనించలేదు అంటూ పోలీసులు అంటున్నారు.ప్రమాదం జరిగిన చాలా సమయానికి స్థానికులు గమనించారు.

దాంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడం, పోలీసులు రాత్రి సమయంలో మృత దేహాలను తరలించడం జరిగింది.ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది.పబ్‌జీ వల్ల ఇంత దారుణమైన ఫలితాలు ఉన్నాయని తెలిసినా కూడా ఇంకా ఎంతో మంది పబ్‌జీ అంటూ దాని వెనుక పరిగెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube