డ్రగ్స్ తరలింపు కేసు! ఇద్దరు భారత సంతతి వారికి 34 ఏళ్ల జైలు శిక్ష  

2 Indian Origin Men Jailed In Largest Drugs Bust In Uk - Telugu 2 Indian-origin Men Jailed, 2 Indian-origin Men Jailed In Largest Drugs Bust In Uk, England, Great Britain, Largest Drugs Bust In Uk, Nri

ఇతర దేశాలలో అప్పుడప్పుడు భారతీయులకి, భారత సంతతి వారికి రకరకాల కేసులలో భారీగా శిక్షలు పడుతూ ఉంటాయి.ఇండియాలో యావజ్జీవ శిక్ష అంటే ఓ 14 ఏళ్లు జైల్లో పెడతారు.

 2 Indian Origin Men Jailed In Largest Drugs Bust In Uk

కాని ఇతర దేశాలలో అలా కాదు.ఏదైనా పెద్ద నేరంలో ఇరుక్కుంటే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి.

అలాగే ఇప్పుడు అక్రమంగా డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడిన ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు యూకేలో 34 ఏళ్ల జైలుశిక్ష పడింది.శక్తి గుప్తా, బాల్దేవ్ సింగ్ ఇద్దరూ 172 కేజీల కొకైన్‌ను అక్రమంగా తరలిస్తూ పోలీసులకు చిక్కారు.

డ్రగ్స్ తరలింపు కేసు ఇద్దరు భారత సంతతి వారికి 34 ఏళ్ల జైలు శిక్ష-General-Telugu-Telugu Tollywood Photo Image

గతేడాది డిసెంబరు 11న బాల్దేవ్ సింగ్ డ్రగ్స్ ఉన్న వాహనాన్ని నడుపుతూ పోలీసులకు చిక్కాడు.ఈ సమయంలో వాహనంలో మొత్తంగా 168 కేజీల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బాల్దేవ్ సింగ్ ఇచ్చిన సమాచారం మేరకు ఆల్డ్స్ ట్రేడింగ్ ఎస్టేట్ పార్క్‌లో రెండో రైడ్ జరపగా మరో నాలుగు కేజీల కొకైన్ దొరికింది.ఈ కేసులో పోలీసులు శక్తి గుప్తాను అరెస్ట్ చేశారు.

యూకేలో ఇంత మొత్తంలో డ్రగ్స్‌ దొరకడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.అది కూడా ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ సప్లై చేసేవాళ్ళు భారతీయులు కావడం గమనార్హం.

అప్పటి నుంచి ఈ కేసుపై కోర్టులో విచారణ జరుగుతూ వచ్చింది.నేరం నిరూపణ కావడంతో తాజాగా కోర్టు తీర్పునిచ్చింది.

శక్తి గుప్తాకు 18 ఏళ్లు, బాల్దేవ్ సింగ్‌కు 16 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ జడ్జి తీర్పిచ్చారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

2 Indian Origin Men Jailed In Largest Drugs Bust In Uk Related Telugu News,Photos/Pics,Images..