నాగేంద్రన్ కేసు : మీ వల్లే ఉరి ఆలస్యమైంది.. ఇద్దరు భారత సంతతి లాయర్లకు సింగపూర్ కోర్ట్ జరిమానా

భారత సంతతికి చెందిన మలేషియా డ్రగ్ స్మగ్లర్ నాగేంద్రన్ కే ధర్మలింగాన్ని ఇటీవల సింగపూర్ ప్రభుత్వం ఉరి తీసిన సంగతి తెలిసిందే.అయితే అతని ఉరిని అడ్డుకోవడానికి యత్నించిన భారత సంతతికి చెందిన ఇద్దరు న్యాయవాదులకు 20,000 సింగపూర్ డాలర్లు ( భారత కరెన్సీలో రూ.11,27,200)ను అటార్నీ జనరల్ ఛాంబర్స్‌కు చెల్లించాలని కోర్ట్ ఆదేశించింది.ఈ కేసులో ఎక్కువ ప్రమేయం వున్న ఎం రవి 75 శాతం ఖర్చు భరించాలని, అలాగే వైలెట్ నెట్టో 25 శాతం జరిమానాను చెల్లించాలని అప్పీల్ కోర్టు ఆదేశించింది.

 2 Indian-origin Lawyers Fined By Singapore Court For Delaying Execution Of Drug Trafficker Nagaenthran K Dharmalingam , Singapore Court, Nagaenthran K Dharmalingam ,-TeluguStop.com

నిజానికి మెరిట్ లేకుండా దరఖాస్తులను దాఖలు చేయడం ద్వారా నాగేంద్రన్ ఉరిశిక్షను ఆలస్యం చేసినందుకు గాను 40,000 సింగపూర్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.22,54,350) చెల్లించాలని ఏజీసీ కోర్టును కోరినట్లు ది స్ట్రెయిట్స్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది.ఇకపోతే.ఏప్రిల్ 27, 2022న చాంగీ జైలు కాంప్లెక్స్‌లో నాగేంద్రన్‌ను ఉరితీశారు.అతను 2010లో 42.72 గ్రాముల హెరాయిన్‌ను అక్రమంగా రవాణా చేసిన కేసులో దోషిగా తేలడంతో కోర్టు అతనికి మరణశిక్ష విధించింది.అయితే దీనిపై నాగేంద్రన్ చేసిన అప్పీల్‌ను 2011లో న్యాయస్థానం కొట్టివేసింది.ఆ తర్వాత తన మరణశిక్షను సవాల్ చేస్తూ.బాధితుడు మొత్తంగా ఏడు పిటిషన్‌లను దాఖలు చేశాడు.ఈ ఏడాది ఏప్రిల్ 26న రీషెడ్యూల్ చేసిన ఉరిశిక్షను ఆపాలని నాగేంద్రన్ తల్లి చివరి నిమిషంలో చేసిన దరఖాస్తును కోర్టు తిరస్కరించింది.

అలాగే గతేడాది నవంబర్ 1న అతనిని ఉరితీయడానికి కొన్ని రోజులు ముందు .న్యాయ సమీక్ష కోరుతూ లాయర్ రవి ఓ పిటిషన్ దాఖలు చేశారు.

 2 Indian-origin Lawyers Fined By Singapore Court For Delaying Execution Of Drug Trafficker Nagaenthran K Dharmalingam , Singapore Court, Nagaenthran K Dharmalingam , -నాగేంద్రన్ కేసు : మీ వల్లే ఉరి ఆలస్యమైంది.. ఇద్దరు భారత సంతతి లాయర్లకు సింగపూర్ కోర్ట్ జరిమానా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సింగపూర్ చట్టాల ప్రకారం.న్యాయస్థానం న్యాయవాదిని వ్యక్తిగత ఖర్చులను చెల్లించాల్సిందిగా ఆదేశించే అధికారం వుంది.అక్రమంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించడం ద్వారా అనవసర ఖర్చులు అవుతాయని న్యాయస్థానం నమ్ముతుంది.బుధవారం ప్రధాన న్యాయమూర్తి సుందరేష్ మీనన్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల అప్పీల్ కోర్ట్.

న్యాయవాదులు వాదించిన కేసులో సహేతుకమైన ఆధారం లేదని డిఫెన్స్‌కి తెలుసునని వ్యాఖ్యానించారు.కేసును నడిపిన తీరు కోర్టు సమయాన్ని దుర్వినియోగం చేయడమేనని ధర్మాసనం అభిప్రాయపడింది.

మరోవైపు తాను, నెట్టో ఇకపై లాయర్లుగా ప్రాక్టీస్ చేయమని, అందువల్ల వ్యక్తిగత ఖర్చులు చెల్లించలేమని రవి చేసిన వాదనను సైతం న్యాయస్థానం తోసిపుచ్చింది.నాగేంద్రన్ మానసిక వికలాంగుడైనందున మరణశిక్షను అమలు చేయరాదనే దానిపై సుదీర్ఘ ప్రక్రియ నడిచింది.ఈ కేసును మార్చి 1న సుప్రీంకోర్టులో రవి సాయంతో నెట్టో వాదించారు.దీనిపై మార్చి 29న న్యాయస్థానం స్పందిస్తూ.నాగేంద్రన్ మానసిక స్ధితి క్షీణించింది అనడానికి ఆమోదయోగ్యమైన ఆధారాలు లేవని పేర్కొంటూ న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది.నాగేంద్రన్ తీసుకొచ్చిన విచారణలు, కోర్టు ప్రక్రియలను దుర్వినియోగం చేశాయని.

అతని ఉరిని ఆలస్యం చేసే లక్ష్యంతో వాటిని నిర్వహించారని ది స్ట్రెయిట్స్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube