ఉగ్రవాదుల డ్రోన్ దాడి...అబుదాబిలో ఇద్దరు భారతీయుల మృతి..!!!

యూఏఈ రాజధాని, వలస వాసులకు కీలక దేశమైన అబుదాబిలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు.అబుదాబి లోని ఎయిర్ పోర్ట్ సమీపంలో డ్రోన్ తో దాడి చేశారు.

 2 Indians And 1 Pakistani Killed In Blast From 'drone Attack' In Abu Dhabi , Ab-TeluguStop.com

ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగించింది.ఎయిర్ పోర్ట్ సమీపంలోని ఓ ప్రాంతంలో జరిగిన ఈ దాడి ఘటన ఎయిర్ పోర్ట్ ను టార్గెట్ గా చేసుకుని జరిగిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఈ దాడిలో ఇద్దరు భారతీయులు మృతి చెందగా ఆరుగురు తీవ్ర గాయాలపాలైనట్టుగా తెలుస్తోంది.వివరాలలోకి వెళ్తే.


అబుదాబిలో పారిశ్రామిక ప్రాంతంగా పేరొందిన ముస్సఫా లో జరిగిన ఈ దాడిని ఉగ్రవాదులు నేరుగా కాకుండా డ్రోన్ ల సాయంతో చేసినట్టుగా తెలుస్తోంది.ఈ దాడి చేయడానికి ఉగ్రవాదులు మొత్తం 3 డ్రోన్లు వాడినట్టుగా పోలీసులు గుర్తించారు.

ఇదిలాఉంటే ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలో ఈ దాడికి పాల్పడింది తామేనని ఎమేన్స్ ఇరాన్ అలిగ్నేడ్ హౌతి మూమెంట్ ప్రకటించింది.పెట్రోల్ ట్యాంక్ లు టార్గెట్ గా చేసుకుని ఈ దాడులు చేశారని అధికారులు తెలిపారు.

Telugu Abu Dhabi, Abudhabi, Drone Attack, Droneattack-Telugu NRI

2019లో కూడా ఈ తరహా దాడులు జరిగాయని అప్పుడు కూడా చమురు స్థావరాలపై దాడులు జరిగినట్టుగా అధికారులు తెలిపారు.ఈ సారి జరిగిన దాడులు కూడా చమురు స్థావరాలపై జరిగినా విమానాశ్రయంపై కూడా ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.తాజాగా జరిగిన దాడులలో విమానాశ్రయ ప్రాంతంలో నిర్మాణం జరిగే చోట కూడా మంటలు వ్యాపించాయని ట్యాంక్ లు పేలుడు కారణంగా విమానాశ్రయానికి ముప్పు వాటిల్లేలా చేయాలని ఉగ్రవాదులు భావించి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.అయితే ఈ దాడి ఘటనలో అక్కడే పనిచేస్తున్న ఇద్దరు భారతీయులు మృతి చెందారని వారు ఎవరు, ఎక్కడి వారు అనే వివరాలు తెలుసుకునేందుకు అక్కడ భారత రాయబారి సంజరు సుదీర్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube