వృద్ధులే టార్గెట్ .. భారీ మోసం: అమెరికాలో ఇద్దరు భారత సంతతి వ్యక్తుల కుట్ర , రుజువైతే 20 ఏళ్ల జైలు

1.2 మిలియన్ డాలర్ల వైర్ మోసాలకు పాల్పడిన ఇద్దరు భారత సంతతి వ్యక్తులు నేరాన్ని అంగీకరించినట్లు యూఎస్ అటార్నీ జనరల్ ఒక ప్రకటనలో తెలిపారు.అరుషోబికే మిత్రా (27), గర్బితా మిత్రా (25)లను నిందితులుగా గుర్తించారు.వీరు భారత్ లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి అమెరికా పౌరులను ముఖ్యంగా వృద్ధులను టార్గెట్ చేసి మోసానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.

 2 Indian Americans Plead Guilty To Usd1.2 Million Fraud , U.s. Attorney General,-TeluguStop.com

ఈ కుట్రకు సంబంధించి అటార్నీ జనరల్ ఫిలిప్ ఆర్ సెల్లింగర్ మాట్లాడుతూ.బాధితులను ఆటోమేటెడ్ కాల్స్ ద్వారా సంప్రదించిన తర్వాత , ఈ రాకెట్ లోని ఇతర సభ్యులు వారిని మోసగించి పెద్ద మొత్తంలో డబ్బును బదిలీ చేయించుకుంటారని ఆయన తెలిపారు.

ఈ ముఠాలోని కొందరు నిందితులు సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్, ఎఫ్‌బీఐ, డీఈఏ వంటి ఏజెన్సీలకు చెందిన ప్రభుత్వ అధికారుల మాదిరిగా నటిస్తారు.తాము చెప్పినట్లు వినకుంటే చట్టపరమైన , ఆర్ధిక పరిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుందని బాధితులను బెదిరిస్తారని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు తెలిపారు.

ముందుగా బాధితులకు ఫోన్ చేసి టెక్ సపోర్ట్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పి నమ్మిస్తారు.అనంతరం వారి వ్యక్తిగత కంప్యూటర్ లకు కాలర్ రిమోట్ యాక్సెస్ కావాలంటూ వారిని బలవంతం చేస్తారని ప్రాసిక్యూటర్లు తెలిపారు.

Telugu Indianamericans, Aroshobike, Garbita Friends, Garbita Mitra, Security, Ge

ఆపై బాధితుల బ్యాంక్ ఖాతాలను యాక్సెస్ చేసి.అనుకోకుండా మీ ఖాతాకు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు చెబుతారు.ఇక మిగిలిన ముఠా సభ్యులు.ఆ డబ్బును వాపస్ చేయాలంటూ బాధితులను బెదిరిస్తారు.ఈ రకంగా అరుషోబికే, గర్బితా మిత్రాలు అమెరికా వ్యాప్తంగా 48 మందిని మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది.ఈ కేసులో వీరిద్దరికీ గరిష్టంగా 20 ఏళ్ల జైలు శిక్ష, 2,50,000 డాలర్ల జరిమానా లేదా బాధితులను మోసం చేసిన సొమ్ము కంటే రెండింతలు వసూలు చేస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube