రోజుకి 2 గంటలు టాయిలెట్ లో టైం పాస్ చేసిన ఉద్యోగి.. చివరికి..?!

ఆఫీస్ కి వెళ్లి పని చేయకుండా హాయిగా టాయిలెట్ లోకి వెళ్లి టైం పాస్ చేసిన ఒక ఉద్యోగి కి ఓ కంపెనీ భారీ షాక్ ఇచ్చింది.దీంతో ఆ ఉద్యోగి లబోదిబోమంటూ తనకు అన్యాయం జరిగిందని సోషల్ మీడియా లో “మిస్టర్ ఏ” పోస్ట్ పేరిట తనకు జరిగిన అన్యాయాన్ని షేర్ చేసి ఆవేదన వ్యక్తం చేశాడు.

 2 Hours Toilet Time Pass Viral News Viral Latest Jober-TeluguStop.com

అంతేకాదు మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించి తనకు న్యాయం చేయాల్సిందిగా కోరాడు.

ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరంగా తెలుసుకుంటే.

 2 Hours Toilet Time Pass Viral News Viral Latest Jober-రోజుకి 2 గంటలు టాయిలెట్ లో టైం పాస్ చేసిన ఉద్యోగి.. చివరికి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తైవాన్ దేశంలో ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగి ప్రతిరోజు సరాసరిన రెండు గంటల పాటు బాత్ రూమ్ లోనే సమయం గడుపుతున్నాడు.నిజానికి అతడికి ప్రతి గంటకు ఆ సంస్థ 160 యువాన్ (రూ.1826) చొప్పున శాలరీ పే చేస్తుంది.ఐతే ఉద్యోగి 22 పని దినాల్లో మేనేజ్మెంట్ కేటాయించిన బాత్రూమ్ టైం ఒక గంట కంటే 27.5 గంటలు ఎక్కువగా టాయిలెట్ లోనే గడిపాడు.దీనితో ఆ కంపెనీ ఉద్యోగి నెల జీతంలో 4,400 యువాన్ (రూ.50,198) కట్ చేసింది.

దీంతో కంగుతిన్న సదరు ఉద్యోగి మల మూత్ర విసర్జనకి టాయిలెట్ లోకి వెళ్లకపోతే ప్యాంటులోనే పని కానిచ్చేవాణ్ని.

దీనివల్ల ఆఫీసంతా కంపుగా మారేదని అతడు చెప్పుకొచ్చాడు.తప్పనిసరి పరిస్థితులలో టాయిలెట్ కి వెళ్లాల్సి వచ్చిందని.

ఇంత మాత్రం దానికే డబ్బులు కట్ చేస్తారా అని అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.అసలు శాలరీ నుంచి మనీ కట్ చేస్తామని తనకు చెప్పలేదని.

ముందుగా చెప్పకుండా ఇలా చేయడం అన్యాయమని ఫేస్‌బుక్‌లోని బ్లేమ్ 2 కమ్యూన్ గ్రూప్ లో పోస్ట్ పెట్టి.న్యాయం కోసం తాను ఏం చేయాలో సలహాలు చెప్పాలి అని తోటి నెటిజన్లను అడిగాడు.

అయితే అతడు పెట్టిన పోస్ట్ కి నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.రెండు గంటలు టాయిలెట్ లో నీకేం పని? బుద్దిగా ఆఫీసులో కూర్చుని ఉద్యోగం చేయాలని కంపెనీ ఆదేశిస్తే అలా కాకుండా గంటల తరబడి టాయిలెట్ లోనే టైం పాస్ చేస్తావా? ఎవరు కూడా టాయిలెట్ కూర్చున్నందుకు డబ్బులు ఇవ్వరు కదా? అని అతడిని తిట్టిపోస్తున్నారు.అయితే ఆఫీస్ యాజమాన్యం సీసీ కెమెరాల ద్వారా ఉద్యోగి ఎంతసేపు బాత్రూంలో సమయం గడిపాడో లెక్కించారు.ఏది ఏమైనా తన నెలవారీ జీతం నుంచి భారీ మొత్తంలో డబ్బు కట్ కావడంతో ఆ ఉద్యోగి షాక్ అయ్యాడు.

#Jober #50198rs #2 Hours Toilet #Time Pass #Salary Money

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు