కెనడాలో ఘోర ప్రమాదం: కారును ఢీకొట్టి, ఈడ్చుకెళ్లిన రైలు.. ఇద్దరు భారతీయ అమ్మాయిల దుర్మరణం

కెనడాలో విషాదం చోటు చేసుకుంది.కారును ఒక గూడ్స్ రైలు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు భారత సంతతికి చెందిన అమ్మాయిలు దుర్మణం పాలయ్యారు.

 2 Girls From Muktsar Faridkot Die In Canada Accident As Car Hit By Goods Train-TeluguStop.com

ఆదివారం రాత్రి బ్రాంప్టన్‌లోని ఒక రైల్వే క్రాసింగ్ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.మరణించిన వారిని పంజాబ్‌లోని ముక్తసర్‌ సమీపంలోని రాణివాలా గ్రామానికి చెందిన జషన్ ప్రీత్ కౌర్ (18), ఫరీద్ కోట్‌లోని దీప్ సింగ్‌వాలా గ్రామానికి చెందిన ప్రభ్‌దీప్ కౌర్ (24)‌గా గుర్తించారు.

ఇక ఇదే ప్రమాదంలో జషన్ ప్రీత్ కజిన్ పాలమ్ ప్రీత్ కౌర్ (21)తో పాటు పటియాలా జిల్లాకు చెందిన కారు డ్రైవర్ తీవ్రంగా గాయాపడ్డారు.ఉన్నత చదువుల కోసం జషన్ ప్రీత్ నెలన్నర క్రితమే పంజాబ్ నుంచి కెనడాకు వచ్చింది.

 2 Girls From Muktsar Faridkot Die In Canada Accident As Car Hit By Goods Train-కెనడాలో ఘోర ప్రమాదం: కారును ఢీకొట్టి, ఈడ్చుకెళ్లిన రైలు.. ఇద్దరు భారతీయ అమ్మాయిల దుర్మరణం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతలోనే ఈ ప్రమాదంలో ఆమె మరణించడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఈ ప్రమాదంపై మొహాలీ క్రైమ్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న ఏఎస్ఐ గురుపార్తాప్ సింగ్ స్పందించారు.

ఈ దుర్ఘటన తర్వాత తన కుమార్తె పాలంప్రీత్ కోలుకుంటోందని.కానీ తన మేనకోడలు జషన్ ప్రీత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిందని చెప్పారు.

తన మేనల్లుడు కూడా కెనడాలోనే నివసిస్తున్నాడని.రైల్వే క్రాసింగ్ వద్ద కారు డ్రైవర్ సిగ్నల్ గమనించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని అతనే తనకు చెప్పాడని గురుపార్తాప్ వెల్లడించారు.

గూడ్స్ రైలు కారును వేగంగా ఢీకొట్టి.దాదాపు 1.5 కి.మీ దూరం వరకు ఈడ్చుకెళ్లిందని ఆయన తెలిపారు.అమ్మాయిలిద్దరూ ఆటోమొబైల్ విడిభాగాల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారని గురుపార్తాప్ చెప్పారు.ఇక జషన్ ప్రీత్ కౌర్ మృతదేహాన్ని భారతదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.చట్టపరమైన లాంఛనాలన్నీ పూర్తి చేయడానికి కనీసం వారం రోజులు పడుతుందని గురుపార్తాప్ పేర్కొన్నారు.

ఇక జషన్‌ప్రీత్ తండ్రి రాజ్‌వీందర్ సింగ్ తన కుమార్తె మరణంతో షాక్‌కు గురయ్యారు.

బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆయన.తనకు జషన్ ప్రీత్ ఒక్కతే సంతానమని.శనివారం రాత్రి ఆమె తల్లితో మాట్లాడిందని ఆవేదన వ్యక్తం చేశారు.తన కూతురు మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావడానికి సాయం చేయాల్సిందిగా రాజ్‌వీందర్ సింగ్.భారత్, కెనడా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

#Muktsar #Prabhdeep Kaur #FaridkotDie #Rajwinder Singh #AutomobileSpare

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube