2 రోజుల పాపను దారుణంగా పొడిచి చంపిన రాక్షసులు!

మనుషులు మృగాలుగా మారుతున్నారు.అన్యంపుణ్యం ఎరుగని ఆడపిల్లలపై కొందరు అత్యాచారాలు చేస్తుంటే మరికొందరు పసిపిల్లలుగా ఉన్నప్పుడే చంపేస్తున్నారు.

 2 Day Old Baby Girl, Stabbed, Death In Bhopal, Madhya Pradesh-TeluguStop.com

నిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయ్.మానవమృగాలు రాక్షసత్వాన్ని చూపిస్తున్నారు.

ఇక అలానే అన్యంపుణ్యం ఎరుగని 2 రోజుల పసిపిల్లను దారుణంగా హింసించి చంపారు.ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో చోటుచేసుకుంది.

ఎవరు ఆ పాప.ఎవరు చంపారు.అంత దారుణంగా శరీరం అంత కత్తితో పొడిచి చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అనే వివరాలు ఏవి ఇందులో లేవు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో రెండు రోజుల వయసు ఉన్న ఆడపిల్లను దారుణంగా కత్తితో పొడిచి చంపారు.ఈ దారుణ ఘటన భోపాల్ నగరం అయోధ్య నగర్‌లో చోటుచేసుకుంది.

పదునైన వస్తువుతో పాపను పొడిచి శాలువాలో చుట్టి ఓ దేవాలయంలో పడేశారు.

అక్కడ ఆ శిశువు మృతు దేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటన స్థలానికి చేరారు.

అక్కడికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమ్మితం తరలించారు.అయితే ఎన్నోసార్లు పొడిచి చంపారు అని ఆ పోస్టుమార్టం రిపోర్ట్ లో వెల్లడైంది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లితండ్రుల ఆచూకీ కోసం సమీపంలోని ఆస్పత్రుల్లో వివరాలు సేకరిస్తున్నారు.

ఈ ఘటనను తెలుసుకున్న నెటిజన్లు ఘటనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

రెండు రోజుల ఆడపిల్లను అంత దారుణంగా హత్య చెయ్యడం ఎంతవరకు న్యాయం అంటూ కామెంట్లు చేస్తున్నారు.మరికొందరు స్పందిస్తూ ఆడపిల్ల, మగపిల్లాడు అని కాదు ఒక పసి బిడ్డను అంత క్రూరంగా ఎలా చంపుతారు.

అసలు వీళ్లు మనుషులేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube