కూలీకి 2.59 లక్షల పన్ను నోటీసులు

ఒడిశాకు చెందిన సనధరా గంద్‌ అనే వ్యక్తి 2014 – 2015 సంవత్సరంలో 1.5 కోట్ల రూపాయల నగదు లావా దేవీలను చేశాడంటూ ఐటీ శాఖ 2.59 లక్షల పన్నును చెల్లించాలంటూ నోటీసులు పంపించడం జరిగింది.ఆ నోటీసులు చూసిన సనధర నోరు వెళ్లబెట్టాడు.

 2 59 Lakhs Tax Fine In Asandhara Gandh-TeluguStop.com

ఎందుకంటే సనధరా ఒక కూలీ.రోజు వారి కూలీగా చేసుకునే అతడు అంత పన్ను ఎలా చెల్లించగలడు.

మరి ఇంతకు అతడు తన ఖాతాల్లో అంతగా ఎలా నగదు లావాదేవీలు చేశాడంటూ ఎంక్వౌరీ చేయగా గతంలో అతడు ఒక వ్యాపారి వద్ద ఉద్యోగం చేసేవాడు.

ఆ సమయంలో సనధరా బ్యాంక్‌ అకౌంట్‌కు సంబంధించిన వివరాలను మరియు పాస్‌ పుస్తకంను తీసుకోవడం జరిగింది.

అప్పుడప్పుడు అతడి సంతకాలు కూడా తీసుకోవడం జరిగిందట.అలా నగధర అకౌంట్‌ నుండి కోటిన్నర రూపాయలను ఆ వ్యాపారి లావాదేవీలు నిర్వహించాడు.

ఇప్పుడు ఆ నగదు లావా దేవీకి సంబంధించిన పన్నును ఇతడు చెల్లించాల్సి వచ్చింది.పన్ను నోటీసులు అందుకు కూలీ ప్రస్తుతం లబోదిబో అంటున్నాడు.

తాను మోస పోయాను, గతంలో తాను పని చేసిన వ్యాపారి ఈ పను చెల్లించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube