‘2.0’ లేట్‌ వల్ల ఎన్ని కోట్లు నష్టమో తెలిస్తే నోరెళ్లబెడతారు!       2018-06-01   00:51:47  IST  Raghu V

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌, శంకర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘శివాజీ’ మరియు ‘రోబో’ చిత్రాలు సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ రెండు సినిమాలు ఆ ఇద్దరి కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ సక్సెస్‌ చిత్రాలుగా నిలిచాయి. ఇప్పుడు అంతకు మించిన విజయం కోసం శంకర్‌ ప్రయత్నం చేశాడు. అదే ‘2.0’. దాదాపు మూడు సంవత్సరాలుగా ఈ సినిమా గురించి మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కడంతో పాటు, భారీ ఎత్తున విజువల్‌ ఎఫెక్ట్స్‌ షాట్స్‌ ఉన్న కారణంగా సినిమా ఆలస్యం అయ్యింది.

సినిమాను ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి పూర్తి చేయడం జరిగింది. సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి దాదాపు 10 నెలలు అవుతుంది. షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత మూడు నెలల్లో విజువల్‌ ఎఫెక్స్‌ పూర్తి చేసి సినిమాను విడుదల చేస్తామని శంకర్‌ అన్నాడు. కాని సినిమా విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతుంది. కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ చాల ఆలస్యం అవుతుంది. 45 కోట్లతో అనుకున్న విజువల్‌ ఎఫెక్స్‌కు ఏకంగా 110 కోట్లు ఖర్చు చేస్తున్నారు. దాంతో పాటు సినిమా బడ్జెట్‌ కూడా అమాంతం పెరిగి పోతుంది.

సినిమాను 350 కోట్ల బడ్జెట్‌తో పూర్తి చేయాలని శంకర్‌ భావించాడు. కాని సినిమా ఆలస్యం అవ్వడం వల్ల దాదాపుగా 550 కోట్లకు బడ్జెట్‌ పెరిగింది. సినిమా ఆలస్యం కారణంగా ఏకంగా 200 కోట్ల బడ్జెట్‌ పెరిగిందన్నమాట. సినిమాకు తీసుకు వచ్చిన ఫైనాన్ష్‌ వడ్డీలు గట్రా అన్ని కలిపితే 200 కోట్ల వరకు అదనంగా అవుతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు విశ్వసనీయంగా చెబుతున్నారు. ఇంత భారీ మొత్తంలో సినిమాకు అదనపు ఖర్చు వల్ల నిర్మాతకు వచ్చే లాభంలో భారీగా గండి ఖాయం అంటున్నారు.

శంకర్‌ దర్శకత్వంలో సినిమా కనుక పెట్టిన పెట్టుబడి రికవరీ వంద శాతం ఖాయం. అయితే నిర్మాతలు ఈ సినిమాకు కాస్త ఎక్కువ ఖర్చు పెట్టారు. దాంతో ఇప్పుడు వారు టెన్షన్‌ పడుతున్నారు. 600 కోట్లను ఈ చిత్రం వసూళ్లు చేయగలుగుతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏం చేసైనా భారీ ఎత్తున సినిమాను విడుదల చేసి ఆ మొత్తంను వసూళ్లు సాధించి తీరుతాను అంటూ శంకర్‌ ధీమాగా ఉన్నాడు. వెయ్యి కోట్ల టార్గెట్‌తో ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఆగస్టు 15న ఈ చిత్రం విడుదలకు ప్రకటన వచ్చింది. మరి ఈ డేట్‌కు అయినా వస్తుందో లేదో చూడాలి.