‘2.ఓ’కు ప్రమోషన్‌ దండగ అంటున్న రజినీకాంత్‌

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘2.ఓ’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.

 2 0 Doesnt Need Promotions At All Rajinkanth-TeluguStop.com

భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం ఈనెల 29న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.దాదాపు 600 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన ఈ చిత్రాన్ని భారీ ఎత్తున పబ్లిసిటీ చేస్తున్నారు.

చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రత్యేక విమానంలో దేశంలోని పలు ప్రాంతాల్లో చక్కర్లు కొడుతూ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.తాజాగా హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ఆ సమావేశంలో చిత్ర యూనిట్‌ సభ్యులు అయిన రజినీకాంత్‌, శంకర్‌, అక్షయ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా రజినీకాంత్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.ఈ చిత్రాన్ని 3డి వర్షన్‌లో చూస్తే ప్రేక్షకులు వేరే లోకంకు వెళ్లిన ఫీలింగ్‌ను అనుభవిస్తారు.శంకర్‌ అద్బుతమైన టేకింగ్‌, మరియు గ్రాఫిక్స్‌తో సినిమాను మరోస్థాయికి తీసుకు వెళ్లాడు.ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన విజువల్స్‌ చూసే ప్రేక్షకులు ఆహా ఓహో అనుకుంటున్నారు.అసలు సినిమా ముందు ఉందని రజినీకాంత్‌ అన్నారు.ఈ చిత్రం కోసం ఇప్పటికే దేశంలోని సినీ ప్రేక్షకులు అంతా కూడా ఎదురు చూస్తున్నారు.

ఈ సమయంలో సినిమాకు ప్రమోషన్‌ అనేది వృదా ఖర్చు.తమిళంలో తెలుగులో కూడా ఈ సినిమాకు ప్రమోషన్‌ చేయవద్దని నిర్మాతలకు చెప్పాను.

కాని వారు వినిజించుకోవడం లేదు.ఇప్పటి భారీగా పబ్లిసిటీ దక్కిన ఈ చిత్రాన్ని ఇంకా ప్రమోట్‌ చేయాల్సిన అవసరం లేదు అనేది తన అభిప్రాయం అంటూ రజినీకాంత్‌ పేర్కొన్నాడు.

ఇక ఈ చిత్రం గురించి శంకర్‌ మాట్లాడుతూ గత సంవత్సరం సినిమా విడుదల చేయాలని భావించినా కూడా గ్రాఫిక్స్‌ కంపెనీ వారు షాక్‌ ఇవ్వడంతో ఇంత ఆలస్యం అయ్యింది.ఆడియో విడుదల తర్వాత వారు ఆరు నెలలు సమయం అడగడంతో షాక్‌ అయ్యాం.అప్పుడు వేరే కంపెనీకి విఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ ఇచ్చామని శంకర్‌ అన్నాడు.

ఇక అక్షయ్‌ మాట్లాడుతూ ఇన్నేళ సినీ కెరీర్‌లో ఈ సినిమా షూట్‌ సమయంలో నేర్చుకున్నన్ని విషయాలు ఎప్పుడు నేర్చుకోలేదు.నాకు ఇది సినిమా కాదు, పాఠశా.శంకర్‌ గారు ఈ పాఠశా ప్రిన్సిపల్‌.శంకర్‌ దర్శకత్వంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను.

రజినీకాంత్‌ చేతిలో విలన్‌గా దెబ్బు తినడం గౌరవంగా భావించానని అక్షయ్‌ పేర్కొన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube