పవన్ కళ్యాణ్ ని ఇమేజ్ కోటరీలో బంధించేసిన ఆ నలుగురు!  

Will Pawan Kalyan Overcome Fans Negative Behavior In Social Media-fans Negative Behavior,pawan Kalyan Overcome,social Mediam Janasena

తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో మొదటి స్థానంలో ఉన్న స్టార్ హీరో పవన్ కళ్యాణ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ మాస్ ఫాలోయింగ్ ఒకప్పటి మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ ని మించిపోయింది. పవన్ కళ్యాణ్ ఐడియాలజీ, ఆలోచన విధానం నేటి యువతరానికి విపరీతంగా ఆకర్షించింది..

పవన్ కళ్యాణ్ ని ఇమేజ్ కోటరీలో బంధించేసిన ఆ నలుగురు! -Will Pawan Kalyan Overcome Fans Negative Behavior In Social Media

ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ని ఒక నటుడిగా కంటే నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తిగా అభిమానులు విశేషంగా గౌరవిస్తూ ఉంటారు. ఇక పవన్ కళ్యాణ్ కోసం ఏం చేయడానికైనా రెడీ అనే ఫ్యాన్ ఫాలోయింగ్ తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కూడా అది ఇది వ్యక్తిగత ఆరాధన కింద మాత్రం లేదని చెప్పాలి.

కానీ ఇప్పుడు మాత్రం ఫ్యాన్స్ అతన్ని గుడ్డిగా ఆరాధిస్తూ ఉంటారు. ఎవరైనా పవన్ కళ్యాణ్ ని ఏమైనా అంటే భరించలేని స్థాయికి చేరుకుని వారిని సోషల్ మీడియాలో విపరీతంగా టార్గెట్ చేస్తూ ఉంటారు.

ఓ విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ బలం తన ఫ్యాన్స్.

ఈ బలం చూసుకుని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేసి ప్రజల్లోకి వచ్చి రాజకీయాల్లో సరికొత్త మార్పు తీసుకురావాలనే లక్ష్యం తో పని చేయడం మొదలుపెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ లక్ష్యం మంచిదే అయినా ఒక సామాన్యుడిగా ప్రజల్లోకి వచ్చి నాయకుడిగా ఎదగాలి అని అతని ఆలోచన, ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని పవన్ కళ్యాణ్ దృక్పథం గొప్పది అయిన పవన్ కళ్యాణ్ చుట్టూ కోటరీలో చేరిన ఫ్యాన్స్ అతని లక్ష్యాలకు అడ్డంగా మారుతున్నారని చెప్పాలి.

పవన్ కళ్యాణ్ చేయాలనుకునే పనిలో, వెళ్లేదారిలో విమర్శలు, ప్రతి విమర్శలు, దాడులు, ప్రతి దాడులు ఉంటాయి. వీటన్నిటిని అధిగమించి కొని పవన్ కళ్యాణ్ వెళ్లే ప్రయత్నం చేస్తున్న అతని ఫ్యాన్స్ మాత్రం జనసేనని మీద జరుగుతున్న ఈ మానసిక దాడులను భరించలేక సోషల్ మీడియా వేదికగా చేసుకొని అవతలి వారిని టార్గెట్ చేయడం చేస్తున్నారు.

ఇది కాస్త ప్రజల్లోకి నెగిటివ్గా వెళ్లి పవన్ కళ్యాణ్ లక్ష్యాలకు అడ్డంకిగా మారుతుందనే మాట ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరి ఇ పవన్ కళ్యాణ్ తరపున ఫ్యాన్ బలాన్ని ఎలా తన లక్ష్యాలకు అనుకూలంగా చేసుకుంటాడు అనే దానిపైనే అతని రాజకీయ ఉనికి ఆధారపడి ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.

పవన్ కళ్యాణ్ లక్ష్యాలకి అడ్డంకిగా మారుతున్న ఫ్యాన్స్.