సమంత 'ఓబేబీ' సినిమా చూసిన తర్వాత నాగచైతన్య రియాక్షన్‌ ఏంటో తెలుసా?  

What Is The Nagachaitanya Reaction After Watching Samantha O Baby-chai Reaction,nagachaitanya,o Baby Movie,samantha,samantha Good Comedy,అక్కినేని సమంత

అక్కినేని సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో సురేష్‌ బాబు నిర్మించిన తాజా చిత్రం ‘ఓబేబీ’. విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రంపై సినీ వర్గాల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవలే టీజర్‌ వచ్చిన తర్వాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. కొరియన్‌ మూవీ అయిన మిస్‌ గ్రానీ చిత్రానికి ఇది రీమేక్‌ అనే విషయం తెల్సిందే..

సమంత 'ఓబేబీ' సినిమా చూసిన తర్వాత నాగచైతన్య రియాక్షన్‌ ఏంటో తెలుసా?-What Is The Nagachaitanya Reaction After Watching Samantha O Baby

ఆ సినిమాకు పూర్తిగా మార్పులు చేర్పులు చేసి, కేవలం సెంటర్‌ లైన్‌ మాత్రమే తీసుకుని ఈ చిత్రాన్ని చేయడం జరిగింది.

సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి చాలా రోజులు అయ్యింది. సినిమా మొదటి కాపీ కూడా వచ్చేసింది. తాజాగా ల్యాబ్‌లో నాగచైతన్య ఈ చిత్రాన్ని చూశాడట.

సినిమా చూసిన తర్వాత నాగచైతన్య నుండి సమంతకు కాంప్లిమెంట్స్‌ అందాయట. నువ్వు మరీ ఇలా కామెడీ కూడా చేయగలవా అంటూ సమంతను పొగడ్తలతో ముంచెత్తాడట. సమంత ఈ చిత్రంలో పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌ పాత్రను చేయడం జరిగింది..

సినిమా ఎండ్‌లో కాస్త ఎమోషనల్‌ సీన్స్‌ ఉన్నా మొత్తంగా చూస్తే సినిమా సరదాగా సాగిపోయిందని చైతూ అన్నాడట.

సమంత ప్రతి సినిమాను ఈమద్య కాలంలో నాగచైతన్య చూసి మొదటి జడ్జ్‌ మెంట్‌ ఇస్తున్నాడు. సూపర్‌ డీలక్స్‌ మరియు మజిలీ చిత్రాలతో మంచి జోరుమీదున్న సమంతకు ఈ చిత్రం కూడా సక్సెస్‌ అయితే హ్యాట్రిక్‌ పడ్డట్లే.

మరి ఈ చిత్రంతో సమంత హ్యాట్రిక్‌ దక్కించుకుంటుందా చూడాలి. మరో వైపు సమంత మన్మధుడు 2 చిత్రాన్ని పూర్తి చేసి ’96’ రీమేక్‌లో నటిస్తోంది. త్వరలోనే నాగచైతన్యతో కలిసి మరో సినిమాలో కూడా ఈ అమ్మడు నటించే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.