గన్స్ తో డాన్స్ కట్టిన బీజేపీ ఎమ్మెల్యే  

Bjp Mla Dance-

బీజేపీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో రెచ్చిపోతున్నారు.ప్రభుత్వ ఉద్యోగులపై బ్యాట్ తో దాడి చేయడమే కానీ, ఇంకేదైనా కానీ నిత్యం ఎదో ఒక చర్యలకు పాల్పడిన బీజేపీ నేతలు వార్తల్లో నిలుస్తున్నారు.

Bjp Mla Dance--Bjp Mla Dance-

తాజాగా ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్ కు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.ఆ వీడియో లో సదరు ఎమ్మెల్యే గారు గన్స్ చేత్తో పట్టుకొని డ్యాన్స్ లు ఆడుతూ హల్ చల్ చేస్తున్నారు.

రెండు గన్స్ మాత్రమే కాకుండా పక్కన ఉన్న వ్యక్తి దగ్గర రైఫిల్ ను కూడా తీసుకొని మరి సార్ గారు డాన్స్ కట్టారు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబందించి ఎవరో వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.

ఆ వీడియో ని చూసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.గన్స్ తో డాన్స్ చేస్తున్న సార్ గారు ఒక వేళ మిస్ ఫైర్ జరిగి ఉంటె పరిస్థితి ఏంటో తెలియడం లేదు.

ఏదైనా అధికారం ఉంది కదా అని ఇలా చిందులు వేస్తే ఊరుకుంటుందా ఇప్పటికే ఉత్తరాఖండ్ బీజేపీ పార్టీ అతడిపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది.రాజకీయ నేతలు తెలిసో తెలియకో ఇలాంటి వివాదాలలో తల దూరుస్తూ వారి పదవులకె ఎసరు తెచ్చుకుంటున్నారు.

ఇలాంటి ఘటనలు ఎన్ని చోటుచేసుకుంటున్నా రాజకీయ నేతలలో మాత్రం మార్పు రావడం లేదు.మరి ఈ ఘటన తో అయినా నేతలు అందరూ తమ హద్దుల్లో ఉంటారో లేదో చూడాలి.