ఊపిరి పీల్చుకున్న అక్కినేని ఫ్యాన్స్‌, అంతా బాగానే ఉంది

గత కొన్ని రోజులుగా నాగార్జునకు వైరల్‌ ఫీవర్‌ అని, ఆయన ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతూ వస్తున్న విషయం తెల్సిందే.నాగార్జునకు ఆరోగ్యం బాగాలేని కారణంగా ఈవారం వీకెండ్‌లో బిగ్‌బాస్‌ షోకు నాగార్జున హోస్టింగ్‌ చేసే అవకాశం కూడా లేదని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.

 1tstop Nagarjuna Ready To Come In Big Boss Show-TeluguStop.com

సోషల్‌ మీడియాలో నాని మరియు మరికొందరి పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చాయి.ఒకటి రెండు వారాలకు గాను వారిని రంగంలోకి దించబోతున్నట్లుగా అడ్డదిడ్డంగా ప్రచారం జరిగింది.

Telugu Nagarjuna, Nagarjunaready-

మీడియాలో వచ్చిన వార్తలతో అక్కినేని ఫ్యాన్స్‌ కాస్త టెన్షన్‌కు గురయ్యారు.అంతగా నాగార్జునకు అనారోగస్య సమస్య రావడం ఏంటీ అంటూ ఆందోళన చెందారు.నాగార్జున ఆరోగ్య విషయమై పదే పదే తెలుసుకునే ప్రయత్నం చేశారు.బర్త్‌డే వేడుకలు కూడా చేసుకోనంత అనారోగ్యంలో నాగార్జున ఉన్నాడని అంతా అనుకున్నారు.అయితే నాగార్జున బయటకు వచ్చింది.కేవలం వైరల్‌ ఫీవర్‌ మాత్రమే అని, తాను మళ్లీ మునుపటిలా ఆరోగ్యంగా తయారు అయ్యాను అంటూ నాగార్జున చెప్పకుండానే చెప్పాడు.

Telugu Nagarjuna, Nagarjunaready-

తాజాగా కళ్యాణ్‌ జూలర్స్‌ కొత్త షో రూం ఓపెనింగ్‌లో నాగార్జున పాల్గొన్నాడు.ఈ సందర్బంగా ఆయన పూర్తి ఆరోగ్యంతో కనిపించాడు.అందుకే ఈ వారంలో బిగ్‌బాస్‌కు మరో గెస్ట్‌ ఎవరు అక్కర్లేదని తప్పకుండా నాగార్జున హాజరు అవ్వడం ఖాయంగా కన్ఫర్మ్‌ అయ్యింది.నాగార్జున అనారోగ్య వార్తల విషయంలో పూర్తి క్లారిటీ వచ్చిన నేపథ్యంలో అక్కినేని ఫ్యాన్స్‌ ఊపిరి పీల్చుకుంటున్నారు.

ప్రస్తుతం నాగార్జున బంగార్రాజు చిత్రం మొదలు పెట్టేందుకు సిద్దం అవుతున్నాడు.అక్టోబర్‌లో సినిమాను ప్రారంభించాలని భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube