కదిలే రైలు ఎక్కుతూ స్లిప్ అయ్యింది చివరికి  

A Lady Comes Under Train Rail-ahamadabadh,comes Under Train,facebook,railway Station

ఈ తరం యువతీ యువకులు దేనికి బానిసలు అవుతున్నా లేకపోయినా ఫోన్ లకు మాత్రం బాగా బానిసలు అయిపోతున్నారు. ఒకప్పుడు చాలా కొద్దీ మంది చేతిలోనే కనిపించే ఈ ఫోన్ లు ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో కూడా తెగ హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఫోన్ లు వాడుకోవడం తప్పులేదు కానీ ఎప్పుడు వాటిని ఉపయోగించాలి ఎప్పుడు ఉపయోగించకూడదు అన్న విషయం లో మాత్రం జనాలకు క్లారిటీ రావడం లేదు..

కదిలే రైలు ఎక్కుతూ స్లిప్ అయ్యింది చివరికి -A Lady Comes Under Train Rail

గుజరాత్ అహ్మదాబాద్ లో ఒక యువతి ఇలా ఫోన్ లో వాట్సాల్ప్ మెసేజ్ లు చూసుకుంటూ కూర్చుంది. అయితే ఈ మెసేజ్ లలో పడి ఆ అమ్మడు అసలు ఎక్కాల్సిన ట్రైన్ రైల్వే స్టేషన్ నుంచి బయలు దేరినప్పటికి కూడా ఆ యువతి ట్రైన్ ఎక్కకుండా మెసేజ్ లు చూసుకోవడం లో మునిగిపోయింది. అయితే ఆ తరువాత తేరుకున్న ఆమె హడావిడి గా ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నించడం తో ఇంతలో జారీ పడింది.

అయితే కొద్దీ సెకన్ల లో ఆ యువతి ట్రైన్ కింద కు పడిపోయింది అనే అనుకున్నారు. అయితే అక్కడే పోలీసులు,ఇతర ప్రయాణికులు అప్రమత్తంగా వ్యవహరించడం తో ఆ యువతి ప్రాణాలతో బయటపడింది. ఫోన్ మోజులో పడి ఆ యువతి చివరికి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. అయితే ఈ ఘటనకు సంబందించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీ ఫుటేజీ లో రికార్డ్ అవ్వగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.