మ్యాన్ హోల్ లో పడిపోయిన ఏడాదిన్నర చిన్నారి  

Toddler Falls Into Open Manhole-mumbai Goregavu,toddler,ముంబై లోని గోరేగావ్,మ్యాన్ హొల్స్

మ్యాన్ హొల్స్ మూసివేయాలి అని ఎన్నిసార్లు ఎంతమంది కోరుతున్నప్పటికీ పదే పదే మ్యాన్ హొల్స్ మూసివేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ఉన్నారు. ఈ మ్యాన్ హొల్స్ లో ఏడాదిన్నర వయసున్న చిన్నారి పడిపోయిన ఘటన ముంబై లోని గోరేగావ్ ఈస్ట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 10:30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది.రోడ్డు పై తిరుగుతున్న ఏడాదిన్నర చిన్నారి దివ్యాంస్ ఒక ఎలక్ట్రికల్ బాక్సు పక్కన ఉన్న భారీ రంద్రంలో పడిపోయాడు..

మ్యాన్ హోల్ లో పడిపోయిన ఏడాదిన్నర చిన్నారి-Toddler Falls Into Open Manhole

అయితే ఆ డ్రైనేజ్ సుమారు ఫీట్ల లోతు ఉన్నట్లు అధికారులు అంటున్నారు. అయితే ఆ చిన్నారికి ఈత కూడా రాకపోవడం తో కొట్టుకుపోయి ఉంటాడు అని,ప్రస్తుతం ఆ బాలుడి కోసం తొమ్మిది గంటల పై నుంచి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

బోరు బావులు మూసివేకపోవడం,ఇలా మ్యాన్ హొల్స్ తీసి ఉంచడం వంటి ఘటనల వల్ల ఎందరో చిన్నారులు తమ ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుంది.

అయితే ప్రస్తుతం దివ్యాంస్ మ్యాన్ హోల్ లో పడిపోవడం మరోపక్క ముంబై లో భారీ గా కురుస్తున్న వర్షాలు కురుస్తుండడం తో అక్కడ నీరు ఉధృతంగా ప్రవహిస్తుడడం తో ఆ చిన్నారి ఆచూకీ తెలుసుకోవడం కష్టంగా మారింది. అయితే ఈ ఘటన చోటుచేసుకున్న సమయంలో పక్కన ఉన్న సీసీ ఫుటేజీ లో ఆ సన్నివేశాలు రికార్డ్ అయ్యాయి. తాజాగా ఈ సీసీ ఫుటేజీ దృశ్యాలు బయటకు రావడం తో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు