జంపింగ్ జిలానీలు ఎవరో బాబు కి తెలిసిపోయిందా ?  

Those Tdp Candidates Are Jump In To Ysrcp Party -

గత కొద్దీ రోజులుగా ఏపీ రాజకీయాల్లో అలజడి సృష్టిస్తున్న అంశం ఏదైనా ఉందా అంటే అది టీడీపీకి చెందిన సుమారు పదిమంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైసీపీలోకి జంపింగ్ చేయాలనీ చుస్తున్నారనే విషయమే.అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జగన్ బాబు ని ఉద్దేశించి మాట్లాడుతూ నేను కనుక మా పార్టీ గేట్లు తెరిస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోతుంది.

Those Tdp Candidates Are Jump In To Ysrcp Party

మీ పార్టీ ఎమ్మెల్యేలంతా వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ జగన్ అనేక సంచలన విషయాలు బయటపెట్టాడు.అప్పటి నుంచి టీడీపీలో ఆందోళన కనిపిస్తోంది.

అలాగే దీనికి బలం చేకూర్చేలా ఎమ్మెల్యేల ప్రవర్తన కూడా ఉండడం బాబు లో అనుమానం మరింత పెంచుతోంది.అందుకోసమే ఎవరెవరు జంపింగ్ చేయాలనీ చూస్తున్నారో అనే అంశంపై దృష్టిపెట్టి దానికి కోసం స్పెషల్ టీమ్ ని నియమించాడు.

జంపింగ్ జిలానీలు ఎవరో బాబు కి తెలిసిపోయిందా -Political-Telugu Tollywood Photo Image

ఆ స్పెషల్ టీమ్ అందించిన లిస్ట్ ప్రకారం ఇప్పటికీ వైసీపీతో ఓ ఐదు మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్టు బాబు కి తెలిసిపోయిందట.దీనికి తోడు అసెంబ్లీ లో బాబుపై అంత రచ్చ జరిగినా ఎవరూ ఎందుకు స్పందించలేదు.

గన్నవరం ఎయిర్ పోర్ట్ లో జరిగిన వ్యవహారంపై మొక్కుబడిగా ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ప్రదర్శన చేయడం ఇలా అన్ని విషయాలను బాబు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.పార్టీ మారాలన్న ఆలోచన ఉన్నవారిని కనిపెట్టి వారిని బుజ్జగించడమో, హెచ్చరించడంతో చేయాలని బాబు ప్లాన్ చేస్తున్నాడు.

ఇంతకీ బాబు కి అందిన లిస్ట్ ప్రకారం మాజీ మంత్రి గంటా సహా విశాఖ నాలుగు సీట్లపై చంద్రబాబుకి అనుమానం ఉందట.అలాగే ప్రకాశంజిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్ పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది.వీరే కాకుండా మరికొంతమంది అనుమానాస్పదంగా ఉన్నట్టు బాబుకి అర్ధమయిపోయింది.అందుకే అసెంబ్లీలో, అసెంబ్లీ బయట ఎమ్మెల్యేల ప్రవర్తనపై కన్నేసి ఉంచేందుకు ఓడిపోయిన ముగ్గురు సీనియర్లతో ఓ టీమ్ ఏర్పాటు చేసినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది.

వీరు సదరు ఎమ్మెల్యేలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టి ఎప్పుడెప్పుడు ఎవరెవరిని కలుస్తున్నారు ? ఎవరి ద్వారా వైసీపీలోకి వెళ్లాలనుకుంటున్నారా ? వారు పార్టీ మారాలనుకోవడానికి ప్రధాన కారణం ఏంటి తదితర విషయాలపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుని బాబుకి చేరవేస్తున్నారని టీడీపీలో కొంతమంది కీలక నాయకుల అంతర్గత సంభాషణలను బట్టి అర్ధం అవుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Those Tdp Candidates Are Jump In To Ysrcp Party- Related....