పోలీసు, న్యాయ వ్యవస్థలనే తప్పుబట్టిన సీనియర్‌ ముద్దుగుమ్మ

సౌత్‌తో పాటు బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించిన హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకున్న తనూశ్రీ దత్తా కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చింది.గత ఏడాది ఒక ఇంటర్వ్యూలో నానా పటేకర్‌పై లైంగిక వేదింపుల ఆరోపణలు చేసింది.

దాంతో దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం ఉవ్వెత్తున లేసింది.మీటూ ఉద్యమం తారా స్థాయికి చేరిన నేపథ్యంలో తనూశ్రీ దత్తా గురించి కొందరు పాజిటివ్‌గా కొందరు నెగటివ్‌గా వ్యాఖ్యలు చేయడం జరిగింది.

నానా పటేకర్‌ తనను లైంగికంగా వేదించాడు అంటూ తనూశ్రీ దత్తా ఆరోపిస్తూ కేసు నమోదు చేసింది.గత ఆరు నెలలుగా ఈ కేసును ఎంక్వౌరీ చేసిన పోలీసులు చివరకు సరైన సాక్ష్యలు లభించలేదు అంటూ కేసును క్లోజ్‌ చేస్తున్నట్లుగా ప్రకటించారు.

సరైన సాక్ష్యాధారాలు లేవు అంటూ కేసును క్లోజ్‌ చేయడంపై తనూశ్రీ దత్తా ఆగ్రహం వ్యక్తం చేసింది.ఒక మహిళ మొహమాటంను వదిలేసి తనను లైంగికంగా వేదించాడు అంటూ చెప్పినా కూడా చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

పోలీసు, న్యాయ వ్యవస్థలనే తప్ప

పోలీసులు మరియు న్యాయ వ్యవస్థ అవినీతిమయం అయ్యింది.అందుకే ఈ కేసు నీరుగారి పోయింది.పోలీసులు మరియు న్యాయవ్యవస్థలు అవినీతిమయం అవ్వడంతో అంతకు మించిన అవినీతి పరుడు అయిన వ్యక్తికి క్లీన్‌ చీట్‌ దక్కిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.పోలీసు వ్యవస్థను తప్పుబట్టినందుకు గాను ఆమెపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

న్యాయవ్యవస్థపై విమర్శలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.ఇప్పుడు తనూశ్రీ దత్తా కూడా అదే కేసులో బుక్‌ అయ్యే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube