ఈ బ్రదర్స్ లొల్లి ఇంకా తేలేలా లేదేమి ?  

Telangana Congress Leaders Komati Reddy Brothers No Stop To Fight-kcr,komati Reddy Brothers,narendra Modi,rahul Gandhi,telangana,v. Hanumantha Rao

తెలంగాణాలో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ లొల్లి ఇప్పట్లో సర్దుమణిగేలా కనిపించడంలేదు. అన్న ఒక పార్టీ తరుపున ఒకంతా పుచ్చుకుంటే తమ్ముడు మరో పార్టీ తరపున ఒకంతా పుచ్చుకుని రాజకీయం చేస్తున్నాడు. అయితే ఈ బ్రదర్స్ ఇద్దరూ కలిసి ఆడుతున్న పొలిటికల్ డ్రామా ఇది అంటున్నవారు లేకపోలేదు..

ఈ బ్రదర్స్ లొల్లి ఇంకా తేలేలా లేదేమి ? -Telangana Congress Leaders Komati Reddy Brothers No Stop To Fight

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం, కాంగ్రెస్ ఇప్పట్లో బలం పుంజుకునే పరిస్థితి లేకపోవడం తదితర కారణాల వల్ల కోమటి రెడ్డి బ్రదర్స్ ఈ రాజకీయ చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ముందు నుంచే కాంగ్రెస్ అధిష్టానం మీద గుస్సాగా ఉన్నట్టు కనిపించారు. ఆయనకు టికెట్ ఇచ్చే విషయంలో అధిష్టానం నాంచివేత ధోరణి అవలంబించడంతో నేరుగా అధిష్టానం మీద విమర్శలు పెద్ద ఎత్తున చేసి జనాల్లో హైలెట్ అయ్యారు.

అప్పట్లో ఎన్నికల దృష్ట్యా అధిష్టానం ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చి సరిపెట్టింది. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో మరో షోకాజ్ నోటిస్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయితే వెంటనే ఆయన మీద బహిష్కరణ వేటు వేస్తే వెంటనే బీజేపీలోకి వెళ్ళిపోతారనే ఆలోచనతో కాంగ్రెస్ అధిష్టానం నాంచివేత ధోరణి అవలంబిస్తోంది.

రాజగోపాల్ రెడ్డి తాజా రాజకీయంపై టి కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత్ రావు తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. గెలిచినప్పుడు మా వల్లే అనే కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ ఓడిపోతే మాత్రం అంతా పార్టీ వల్లే అనడం వారికి అలవాటుగా మారింది అంటూ సెటైర్లు వేశారు. అవకాశవాదులు కాంగ్రెస్ లో స్థానం లేదని వారి బయటకి వెళ్లిపోవడం మంచిదే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇది ఇలా ఉంటే తనకు కనుక టి.పీసీసీ బాధ్యతలు అప్పగించి ఉంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణాలో ఇటువంటి దుర్భర పరిస్థితి వచ్చి ఉండేది కాదని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. తమకు గాని టిపిసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పగించి ఉంటే తెలంగాణాలో కాంగ్రెస్ కి ఇంత దుస్థితి వచ్చి ఉండేదే కాదంటున్నారు రాజగోపాల్ రెడ్డి. తానేమి పార్టీ మారాలని అనుకోవడంలేదంటూ పార్లమెంట్ బయట స్ఫష్టం చేసేసారు.

మోడీ ని ప్రశంసిస్తే రాహుల్ ను నిందించడం ఎలా అవుతుందని పార్టీ నేతలను దుమ్మెత్తిపోశారు ఆయన.తెలంగాణ కాంగ్రెస్ లో తుడిచిపెట్టుకుపోవడానికి సొంత పార్టీ వారే కారణమని ఆరోపించారు.