ఏపీ కి వచ్చిన కేసీఆర్  

Telangana Cm Kcr In A P-kcr,ktr,prabhakar,telangana,vinodh Kumar

తెలంగాణ సిఎం కేసీఆర్ ఏపీ కి బయలుదేరి వచ్చారు. సోమవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యెక్ విమానంలో బయలుదేరి వచ్చిన సీ ఎం కేసీఆర్ ముందుగా విజయవాడ లోని కనక దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేదపండితులు,ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వగతం పలికారు..

ఏపీ కి వచ్చిన కేసీఆర్ -Telangana CM KCR In A P

కేసీఆర్ వెంట కేటీఆర్,ప్రభాకర్,వినోద్ కుమార్ తదితర్డులు ఉన్నట్లు తెలుస్తుంది. మధ్యాహ్నం వంటి గంటన్నర కు ఆలయానికి చేరుకున్న ఆయన అమ్మవారి దర్శనం ముగిసిన వెంటనే అక్కడ నుంచి నేరుగా బయలుదేరి తాడేపల్లి లోని ఏపీ సీ ఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఈ నెల 21 న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సి ఎం జగన్ ముఖ్య అతిధిగా రావాలని కేసీఆర్ ఆహ్వానించనున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ ని ఆహ్వానించిన కేసీఆర్, ఇప్పుడు నేరుగా ఏపీ వచ్చి మరీ సి ఎం జగన్ ను ఈ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా కోరినట్లు తెలుస్తుంది.

అలానే జగన్ తో కలిసి లంచ్ కూడా చేయనున్నట్లు తెలుస్తుంది. ఇంకా ఈ ఇద్దరి సమావేశంలో ఎలాంటి అంశాలపై చర్చలు జరుపుతారు అన్న దానిపై ఎలాంటి స్పష్టత లేదు. అలానే సాయంత్రం 5 గంటలకు కృష్ణా నది ఒడ్డున శారదా పీఠం కు సంబందించిన కార్యక్రమంలో పాల్గొని అనంతరం 7 గంటలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిపోతారు. ఏపీ సి ఎం జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఇరు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాల సి ఎం లు సమన్వయం తోనే పలు అంశాలపై ముందుకు కొనసాగుతున్నారు.

ఈ క్రమంలోనే ఏపీ లో జగన్ పార్టీ గెలిచిన తరువాత,సీ ఎం గా ప్రమాణస్వీకార కార్యక్రమ ఆహ్వానానికి జగన్ నేరుగా హైదరాబాద్ వెళ్లి మరి కేసీఆర్ ని కలిసిన సంగతి తెలిసిందే.