తీన్మార్‌ సావిత్రి అక్కను త్వరలో అక్కడ చూడబోతున్నామా?  

Teenmar Savitri In Big Boss Show-bithiri Sathi,news Channel Anchor,savitri,teenmar,v6 News Channel,బిత్తిరి సత్తి,సావిత్రిలు

ప్రస్తుతం తెలుగులో ఎన్నో న్యూస్‌ ఛానెల్స్‌ ఉన్నాయి. అయితే వాటిలో కొన్నింటికి మాత్రమే గుర్తింపు ఉంది. తెలంగాణ న్యూస్‌ ఛానెల్‌గా పేరు దక్కించుకున్న వీ6 న్యూస్‌ ఛానెల్‌కు మంచి ఆధరణ దక్కుతోంది. వీ6 ఛానెల్‌కు ఇంత ఆధరణ దక్కడంలో ప్రధాన కారణం తీన్మార్‌ న్యూస్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా ఏళ్లుగా తీన్మార్‌ న్యూస్‌ వీ6కు మంచి రేటింగ్‌ను తెచ్చి పెడుతోంది. ప్రస్తుతం తీన్మార్‌ న్యూస్‌కు సావిత్రి యాంకర్‌గా వ్యవహరిస్తోంది..

తీన్మార్‌ సావిత్రి అక్కను త్వరలో అక్కడ చూడబోతున్నామా?-Teenmar Savitri In Big Boss Show

బిత్తిరి సత్తి మరియు సావిత్రిలు అక్క తమ్ముడుగా కామెడీ పండిస్తూ ఉంటారు.

బుల్లి తెరపై సెన్షేషన్‌ క్రియేట్‌ చేసిన సావిత్రి మరియు బిత్తిరి సత్తిలు ఈమద్య మీడియాలో తెగ వార్తల్లో ఉంటున్నారు. బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో బిత్తిరి సత్తి పార్టిసిపెంట్‌గా ఉండబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వార్తలు ఇంకా వస్తున్న సమయంలోనే అప్పుడే సావిత్రి ఈ సీజన్‌లో కనిపించబోతుందని వార్తలు వస్తున్నాయి.

సావిత్రి అసలు పేరు జ్యోతి. గత కొన్ని రోజులుగా జ్యోతితో షో నిర్వాహకులు చర్చలు జరుపుతున్నారు.

సావిత్రికి భారీ పారితోషికం ఆఫర్‌ చేసి మరీ బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఆమెను తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారంఅందుతోంది. ప్రస్తుతం సావిత్రి తీన్మార్‌ వార్తలు చదువుతూ ఉంది.

ఆమె తీన్మార్‌ వార్తలను వదిలేస్తే మళ్లీ ఛాన్స్‌ వస్తుందో రాదో తెలియదు. అలాంటి సమయంలో ఆమె తీన్మార్‌ వార్తలను వదిలేసి బిగ్‌బాస్‌లో పార్టిసిపేట్‌ చేస్తుందా అనేది అనుమానమే. కాని సావిత్రి బిగ్‌బాస్‌లో ఉంటుందని సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది..

జులై నెలలో ప్రారంభం కాబోతున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో అసలు ఉండేది ఎవరో ప్రారంభోత్సవం రోజే తెలిసే అవకాశం ఉంది.