శ్రీరెడ్డి విచ్చలవిడితనం.. తల్లి ఇది ఇండియా మరేదో దేశం కాదు  

Sri Reedy Comments On Her Personal Life-

కాస్టింగ్‌ కౌచ్‌తో ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చిన శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నై మరియు హైదరాబాద్‌ చుట్టేస్తోంది. ఈ అమ్మడు చెన్నైలో నివాసం ఉంటూనే హైదరాబాద్‌లో కూడా కనిపిస్తూ వస్తోంది. తమిళంలో ఈమెకు నటిగా ఛాన్స్‌ వచ్చిందని వార్తలు వచ్చాయి..

శ్రీరెడ్డి విచ్చలవిడితనం.. తల్లి ఇది ఇండియా మరేదో దేశం కాదు-Sri Reedy Comments On Her Personal Life

అయితే అది నిజమేనా అనే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఆమె నటించిన సినిమాలు ఏవీ కూడా బయటకు రాలేదు. ఈ సమయంలోనే శ్రీరెడ్డి సోషల్‌ మీడియా పోస్ట్‌లతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది.

శ్రీరెడ్డి తన సోషల్‌ మీడియా ఫేస్‌ బుక్‌ పేజ్‌లో ప్రతి రోజు ఏదో ఒక అప్‌డేట్‌ పెడుతూనే ఉంటుంది. ఇటీవలే శ్రీశైలం వెళ్లినట్లుగా పోస్ట్‌ చేసి తనలోని భక్తిభావంను చాటుకున్న శ్రీరెడ్డి తాజాగా తన విచ్చలవిడితనంను కూడా చెప్పకనే చెప్పింది. తనకు ఒక భర్త ఒక ప్రియుడు సరిపోడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మరీ శ్రీరెడ్డి ఇంతగా బరితెగించింది ఏంటీ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఇంతకు శ్రీరెడ్డి ఏమన్నదంటే. తాను ఫ్యామిలీ టైప్‌ కాదు, నా కుటుంబ సభ్యులు ఏమనుకున్నా కూడా నేను సంవత్సరంకు ఒకరితో లైఫ్‌ను షేర్‌ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు ఒకే వ్యక్తితో జీవితంను పంచుకోవడంపై ఆసక్తి లేదు అంటూ చెప్పుకొచ్చింది. అందుకే సంవత్సరంకు ఒకరి చొప్పున వారితో ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నట్లుగా నిర్మొహమాటంగా చెప్పేసింది.

మొత్తానికి ఈ అమ్మడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాను కుదిపేస్తున్నాయి. ఆమెపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఇది ఇండియా, ఇక్కడ అలాంటివి కుదరవు అంటూ ఆమె పోస్ట్‌కు కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు..