చిన్నోళ్లం దయచేసి తొక్కేయకుండా మమ్ములను ఆధరించండి  

Sapthagiri Comments On Vajrakavachadhara Govindha Success Meet-sapthagiri,success Meet,vajrakavacahadhara Govindha,సక్సెస్‌ మీట్‌,సప్తగిరి

సహాయ దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి, అక్కడ నుండి కమెడియన్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్న సప్తగిరి ఈమద్య కాలంలో హీరోగా కూడా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. హీరోగా సప్తగిరి ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశాడు. మొదటి సినిమా పర్వాలేదు అనిపించుకుంది, రెండవ సినిమా ఫ్లాప్‌ అయ్యింది..

చిన్నోళ్లం దయచేసి తొక్కేయకుండా మమ్ములను ఆధరించండి -Sapthagiri Comments On Vajrakavachadhara Govindha Success Meet

మూడవ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సప్తగిరి మూడవ సినిమా వజ్రకవచధర గోవింద చిత్రం మంచి టాక్‌ను దక్కించుకుంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

తాజాగా సినిమా సక్సెస్‌ మీట్‌ను యూనిట్‌ సభ్యులు ఏర్పాటు చేశారు.

ఈ సందర్బంగా సప్తగిరి మాట్లాడుతూ మా సినిమాకు మాస్‌ ఆడియన్స్‌ నుండి మంచి స్పందన వచ్చింది. మంచి వసూళ్లు కూడా నమోదు అవుతున్నట్లుగా డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. మేము చేసిన ఈ చిరు ప్రయత్నంను మీ అందరు ఆధరించాలి.

మొదట ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది, ఆ తర్వాత యావరేజ్‌ అన్నారు. యావరేజ్‌ టాక్‌ వచ్చినా కూడా మేము చేసిన సినిమాకు న్యాయం చేకూరినట్లే అంటూ సప్తగిరి చెప్పుకొచ్చాడు.

మేము చిన్న వాళ్లం, ఈ సినిమాను చూసి మమ్ముల ఆధరిస్తే మేము మరిన్ని సినిమాలు చేస్తాం. తప్పకుండా మీ ముందుకు మంచి సినిమాలను తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తాం.

ఆదిలోనే మమ్ములను తుంచేయకండి అంటూ ఈ సందర్బంగా సప్తగిరి కోరాడు. మాస్‌ ఆడియన్స్‌ మాత్రమే కాకుండా క్లాస్‌ ఆడియన్స్‌ కూడా తమ సినిమాను చూడాలంటూ ఈ సందర్బంగా సప్తగిరి కోరాడు. మరి ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు ఎలాంటి ఆధరణ వస్తుంది అనే విషయం ఫైనల్‌ కలెక్షన్స్‌ను బట్టి అర్ధం అవ్వనుంది..