కాంగ్రెస్ పార్టీని నడపలేనని చేతులెత్తేసిన రాహుల్ గాంధీ! అధ్యక్ష బాద్యతలు మరో సీనియర్ నేతకి  

కాంగ్రెస్ చీఫ్ బాద్యతలు నుంచి పూర్తిగా తప్పుకుంటున్న రాహుల్ గాంధీ. .

Rahul Gandhi Not Interested For Congress Chief Position-

దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రస్తానం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ తన ప్రస్తానం కొనసాగిస్తూ వస్తుంది.ఇక కాంగ్రెస్ పార్టీ అంటే నెహ్రు కుటుంబం కనిపిస్తుంది..

Rahul Gandhi Not Interested For Congress Chief Position--Rahul Gandhi Not Interested For Congress Chief Position-

ఆ కుటుంబ వారసులె పార్టీని నడిపిస్తూ వస్తున్నారు.ఇక ఆ కుటుంబం నుంచే ఎక్కువగా ప్రధాన మంత్రులుగా ఎక్కువ కాలం దేశ రాజకీయాలని శాసిస్తూ వస్తున్నారు.ఇక గతంలో ఇందిరా ఫ్యామిలీ నుంచి సోనియాకి ప్రధానిగా చేసే అవకాశం వచ్చిన ఆమె విదేశీ మహిళ అనే అభియోగాల నేపధ్యంలో ఆమె చ్సుయకుండా వెనకుండి నడిపిస్తూ మన్మోహన్ సింగ్ ని ప్రధానిగా చేసింది.

ఇదిలా ఉంటే తాజాగా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ బాద్యతలని రాహుల్ గాంధీ తీసుకున్నారు.

ఇక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాహుల్ గాంధీ ముందుండి పార్టీని నడిపించడమే కాకుండా తాజా ఎన్నికలలో అతని నాయకత్వంలోనే బరిలోకి దిగారు.అయితే మోడీ ప్రభజనం ముందు రాహుల్ గాంధీ నిలవలేకపోయాడు.

మోడీ ఎత్తులకి, అలాగే వ్యూహాత్మక రాజకీయాలకి రాహుల్ సరైన సమాధానం చెప్పలేకపోవడంతో పాటు, దేశ ప్రజలని కూడా తన నాయకత్వ లక్షణంతో మెప్పించలేకపోయాడు.దీంతో 2014 తర్వాత మరో సారి కాంగ్రెస్ కి భారీ ఓటమి వచ్చింది.కేవలం 52 సీట్లకి మాత్రమే కాంగ్రెస్ పరిమితం అయిపోయింది.దీంతో అతను ఓటమికి నైతిక బాద్యత వహిస్తూ కాంగ్రెస్ అధినేత హోదాకి రాజీనామా చేసారు.అయితే అతని నిర్ణయంపై కాంగ్రెస్ నేతలు వ్యతిరేకత వ్యక్తం చేసి, తననే ఉండాలని పట్టుబట్టిన అతను మాత్రం ఉండటానికి సిద్ధంగా లేరు.

దీంతో చాలా కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పార్టీ అధ్యక్షుడుగా వేరొక వ్యక్తిని నియమించడానికి సిద్ధం అవుతుంది.ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుడుగ సీనియర్ మంత్రి ఎకె ఆంటోనీకి ఆ బాద్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది.