'సాహో' గురించి ఆసక్తికర అప్‌డేట్స్‌.. ఫ్యాన్స్‌కు పిచెక్కించే వార్త  

Prabhas Sahoo Story Leak-sahoo,sujith,teaser,ప్రభాస్,స్వాతంత్య్ర దినోత్సవం

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించిన ‘సాహో’ చిత్రం విడుదలకు ముస్తాభవుతోంది. గత రెండు సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న సాహో చిత్రం స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఇటీవలే విడుదలైన టీజర్‌ సినిమా హాలీవుడ్‌ రేంజ్‌లో ఉంటుందేమో అనిపించేలా ఉంది. యాక్షన్‌ సీన్స్‌తో పాటు రొమాంటిక్‌ సీన్స్‌ కూడా సినిమాలో కుప్పలు తెప్పలుగా ఉంటాయని సినిమా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు..

'సాహో' గురించి ఆసక్తికర అప్‌డేట్స్‌.. ఫ్యాన్స్‌కు పిచెక్కించే వార్త-Prabhas Sahoo Story Leak

ఈ చిత్రంలో ప్రభాస్‌ మరియు శ్రద్దా కపూర్‌ల పాత్రల గురించి ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.

ఈ చిత్రంలో శ్రద్దా కపూర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతుందని ఇప్పటికే తేలిపోయింది. శ్రద్దా కపూర్‌ పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతుంది. హీరోయిన్‌ పోలీస్‌ ఆఫీసర్‌ అయితే మరి హీరో విలన్‌ అయ్యి ఉంటాడా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ప్రభాస్‌ మొదట ఒక దొంగల బ్యాచ్లో సభ్యుడిగా ఉంటాడు. ఆ తర్వాత ఆ దొంగల బ్యాచ్‌ను ఏరిపారేసే అండర్‌ కవర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తాడంటూ సమాచారం అందుతోంది. .

ఈ చిత్రంలో ప్రభాస్‌ అండర్‌ కవర్‌ పోలీస్‌ అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

సినిమా విడుదల దగ్గర పడుతున్న సమయంలో సినిమాకు సంబంధించిన విషయాలను ఒక్కటి ఒక్కటిగా లీక్‌ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించేందుకు ఇలా స్టోరీని లీక్‌ చేస్తున్నట్లుగా కొందరు అంటున్నారు. ఏది ఏమైతేనేం సాహో చిత్రంకు అంచనాలు భారీగా ఉన్నాయి. పరిస్థితి చూస్తుంటే మొదటి వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈజీగా 300 కోట్ల వరకు రాబట్టే అవకాశం కనిపిస్తుంది. లాంగ్‌ రన్‌ లో 500 కోట్ల వరకు రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.