అమెరికాలో కాల్పులు...ఒకరి మృతి..  

Philadelphia Graduation Party Shooting Leaves 1 Dead-

అమెరికాలో ఎప్పుడు, ఎక్కడ, ఏ నిమిషంలో తూటా పేలుతుందో చెప్పలేని పరిస్థితి.ఎంతో మంది భారతీయులు అమెరికా కాల్పుల ఘటనలో ప్రాణాలు కోల్పోయారు కూడా.మరెంతో మంది అమెరికన్స్ విగత జీవులుగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఎన్ని పరిణామాలు జరిగినా సరే అమెరికాలో తుపాకీ మోతలు మోగుతూనే ఉంటాయి.తాజాగా

Philadelphia Graduation Party Shooting Leaves 1 Dead--Philadelphia Graduation Party Shooting Leaves 1 Dead-

అమెరికాలోని ఫిలడెల్ఫియాలో తూటా పేలింది.గ్రాడ్యుయేషన్‌ పార్టీకి హాజరైన యువకులపై గుర్తు తెలియని ఓ వ్యక్తి వచ్చి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడని తెలుస్తోంది.ఈ కాల్పుల ఘటనపై స్థానిక పోలీసు కమిషనర్‌ రిచార్డ్‌ రాస్‌ స్పందించారు.ఈ కాల్పుల ఘటన ఎంతో దారుణమని అన్నారు.ఈ కాల్పులకి తెగ బడిన వారిలో నలుగురు 15 నుంచి 17 ఏళ్ల వయసు వాళ్ళు కాగా మిలిగిన వాళ్ళకి 20 ఏళ్ల వయసు ఉందని తెలిపారు.

Philadelphia Graduation Party Shooting Leaves 1 Dead--Philadelphia Graduation Party Shooting Leaves 1 Dead-

కాల్పుల్లో గాయపడిన వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.గాయపడిన వారిని స్థానికంగా ఉన్న దావఖానాలో చేర్చారని తెలుస్తోంది.వారందరూ అక్కడ చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.ఈ పార్టీ కి సుమారు 60 మంది హాజరయ్యారని తెలుస్తోంది.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.