వైసీపీకి ప్రచారం చేసిన పృథ్వీకి చుక్కలు చూపుతున్న మెగా కాంపౌండ్‌  

Mega Family Angry On Comedian Pruthvi-allu Arjun,aswinidutt,posani Krishna Murali,pruthvi,tollywood,trivikram,అల్లు అర్జున్‌,పృధ్వీ

టాలీవుడ్‌ ప్రముఖులు కొందరు ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీలకు ప్రచారం చేసిన విషయం తెల్సిందే. ఏపీ ఎన్నికల్లో వైకాపాకు కమెడియన్స్‌ పృథ్వీ, అలీ మరియు పోసానీలు చాలా ఎక్కువగా ప్రచారం చేసిన విషయం తెల్సిందే. దాంతో ఈ ముగ్గురికి సినిమాలపై ప్రభావం పడ్డట్లుగా తెలుస్తోంది..

వైసీపీకి ప్రచారం చేసిన పృథ్వీకి చుక్కలు చూపుతున్న మెగా కాంపౌండ్‌-Mega Family Angry On Comedian Pruthvi

వైకాపాకు ప్రచారం చేసినందుకు తనను ఒక సినిమా నుండి తప్పించారంటూ ఇటీవలే పోసాని ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ నిర్మాత కూడా మరెవ్వరో కాదు అశ్వినీదత్‌ అని కూడా చెప్పేశాడు.

ఇప్పుడు ఆ ప్రభావం పృధ్వీపై కూడా పడింది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్‌తో ప్రస్తుతం త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న సినిమాలో మొదట పృధ్వీని ఎంపిక చేయడం జరిగింది. కీలక పాత్ర కోసం ఆయన డేట్లు కూడా తీసుకుని అడ్వాన్స్‌ ఇచ్చారట. కాని ఇప్పుడు ఆయనకు సినిమాలో స్థానం లేదని సహాయ దర్శకుడు ఒకరు కాల్‌ చేసి చెప్పడం జరిగిందట.

తాము తీసుకున్న డేట్లలో షూటింగ్‌కు రానవసరం లేదు అంటూ చెప్పడంతో పృథ్వీకి సీన్‌ అర్థం అయ్యిందట.

అల్లు అర్జున్‌ కారణంగానే పృథ్వీని సినిమా నుండి తొలగించినట్లుగా సమాచారం అందుతోంది. అందుకు సంబంధించిన ప్రచారం సోషల్‌ మీడియాలో జోరుగా సాగుతున్న నేపథ్యంలో మెగా కాంపౌండ్‌పై విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇలా ఇండస్ట్రీలో కొందరిని టార్గెట్‌ చేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదని, ఇలా చేస్తే ఇండస్ట్రీలో విభేదాలు తారా స్థాయికి చేరుకుని చీలిపోయే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అలీ కూడా పలు సినిమాల నుండి తొలగించబడ్డట్లుగా తెలుస్తోంది.