మోడీ రెండోసారి ప్రధాని అయిన తరువాత తోలి సారిగా నిర్వహించనున్న పార్లమెంట్ సమావేశాలు  

Loksabha Meeting Will Starts Soon-loksabha Meeting,modi,mp Menaka Gandhi,nda,veerendra Kumar,నరేంద్ర మోడీ

కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో రెండోసారి NDA ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలిసారిగా పార్లమెంట్ సమావేశాలు మొదలు కానున్నాయి. తోలి రెండు రోజులలో ప్రొటెం స్పీకర్ గా ఎన్నికైన బీజేపీ సీనియర్ ఎంపీ వీరేంద్ర కుమార్, కొత్త ఎంపీ ల ప్రమాణ స్వీకారం చేయిస్తారు..

మోడీ రెండోసారి ప్రధాని అయిన తరువాత తోలి సారిగా నిర్వహించనున్న పార్లమెంట్ సమావేశాలు -Loksabha Meeting Will Starts Soon

అలానే జూన్ 19 న లోక్ సభ కొత్త స్పీకర్ ఎన్నిక కూడా ఉండనుంది. అయితే ఈ సారి లోక్ సభ స్పీకర్ గా ఎవరిని ఎన్నుకుంటారు అన్న విషయం లో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సుమిత్రా మహాజన్ స్థానంలో ఎవరు లోక్ సభ స్పీకర్ గా ఎన్నిక అవుతారు అన్న విషయం తేలాల్సి ఉంది. అయితే ఈ పదవికి సీనియర్ ఎంపీ మేనకా గాంధీ ని ఎన్నుకొనే అవకాశము ఉన్నట్లు తెలుస్తుంది.

జూన్ 20న ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ప్రసంగిస్తారు.

ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యావాదాల తీర్మానంపై చర్చ జరుగుతుంది. నిజానికి ఏటా ఫిబ్రవరిలోవార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్ కు సమర్పిస్తారు. అయితే ఎన్నికల నేపథ్యంలో ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌ను మాత్రమే ప్రవేశ పెట్టడం తో జూలై 5న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, దేశ వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభ కు సమర్పిస్తారు. 17వ లోక్‌సభ తొలి సెషన్‌లో కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది. ఆధార్ సవరణ బిల్లు, ట్రిపుల్ తలాఖ్ బిల్లులు మరోసారి పార్లమెంట్‌ ముందుకు రానున్నాయి. అయితే ఈసారి సమావేశాల్లో కూడా ప్రతిపక్ష హోదా లేకుండానే ఎన్డీయే ప్రభుత్వం సమావేశాలలో పాల్గొననుంది.

ఈ సారి జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ 52 స్థానాలు మాత్రమే దక్కించుకోవడం తో ప్రతిపక్ష హోదాను ఈ సారి కూడా పొందలేకపోయింది. దీనితో ఎలాంటి ప్రతిపక్షం లేకుండా మోడీ సర్కార్ ఈ సమావేశాలు నిర్వహించనుంది.