అన్న అటు.. తమ్ముడు ఇటు ! ఇదో కొత్త ప్లానా బ్రదర్  

Komati Reddy Rajagopal Reddy Plan To Leave In Congress Party-bjp,komatireddy Rajagopal Reddy,telangana,telangana Congress,trs,venkat Reddy,కోమటిరెడ్డి బ్రదర్స్,రాజగోపాల్ రెడ్డి

రాజకీయ నాయకుల తెలివితేటలు సామాన్యులు ఎవరికీ అర్ధం కావు. వారు ఏమి చేసినా దానికి ఒక ప్రణాళిక, వ్యూహం ఉంటుంది. రాబోయే రోజుల్లో తమ రాజకీయ భవిష్యత్తుకి ఏ మాత్రం ఢోకా లేకుండా చూసుకుంటారు..

అన్న అటు.. తమ్ముడు ఇటు ! ఇదో కొత్త ప్లానా బ్రదర్ -Komati Reddy Rajagopal Reddy Plan To Leave In Congress Party

ఇవన్నీ షరా మామూలే అయిపోయాయి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో వలసలు ఆ పార్టీకి నిద్ర నిప్పులు లేకుండా చేస్తున్నాయి. పార్టీలో మిగిలి ఉన్న కొద్ది మంది నాయకులు కూడా పక్క చూపులు చూస్తుండడం కలవరం పుట్టిస్తుండగా కోమటి రెడ్డి బ్రదర్స్ మాత్రం సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు.

ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతే కాదు తనతో పాటు. కొంత మందిని తీసుకెళ్లేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే ఆయన సోదరుడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెబుతున్నారు. ఈ బ్రదర్స్ రాజకీయం ఏంటో ఎవరికీ అర్ధంకాకుండా ఉంది.

కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయాల్లో చాలా కాలం నుంచే ఉన్నారు. ముందుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయాల్లో పట్టు సాధించాక ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డిని తీసుకొచ్చారు. వైఎస్ హయాంలో భువనగిరి ఎంపీగా టిక్కెట్ ఇప్పించడమే కాకుండా గెలిపించారు కూడా. అలా రాజకీయ ఆరంగేట్రం చేసిన రాజగోపాల్ రెడ్డి, కొంత కాలం నుంచి అన్న కంటే ఎక్కువగా రాజకీయం చేస్తున్నారు.

వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు టి. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియాపై వివాదాస్పద ప్రకటనలు చేసి కలకలం రేపారు..

ప్రస్తుతం తాను బీజేపీలోకి వెళ్తున్నాని ఓపెన్ గా చెప్పేస్తున్నారు.

వాస్తవంగా చూస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ ఒకే మాట మీద ఉంటారు. ఎవరికీ వారు సొంత రాజకీయం ఎప్పుడూ చేయరు.

ఇప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డిని బీజేపీలోకి పంపడం అనేది వెంకటరెడ్డి ప్లానేనన్న గుసగుసలు కాంగ్రెస్‌లోనే గట్టిగా వినిపిస్తున్నాయి. తనకు పీసీసీ చీఫ్ పోస్ట్ ఇవ్వకపోతే తాను కూడా అలాగే వెళ్తానన్న సందేశాన్ని ఇచ్చేందుకే ఆయన అలా చేస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. అదే సమయంలో వెంకటరెడ్డి మాత్రం పార్టీపై ఎనలేని విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు.

తుదిశ్వాస వరకూ. పార్టీలోనే ఉంటానంటున్నారు.

ఈ డబల్ గేమ్ రాజకీయం ఏంటో ఎవరికీ అర్ధం కాకుండా ఉంది.