'కల్కి' విడుదల విషయంలో ఏంటీ ఈ గందరగోళం  

Kalki Release Date Confirm-

రాజశేఖర్‌ హీరోగా అదా శర్మ హీరోయిన్‌గా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కల్కి’ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. అయితే కొన్ని సీన్స్‌ సరిగా రాలేదు అంటూ రీ షూట్‌ అనుకున్నారు. మే చివరి వారంలో విడుదల కావాల్సి ఉండగా రీ షూట్‌ కారణంగా జులైలో లేదా ఆగస్టులో సినిమాను విడుదల చేయాలని భావించారు. అయితే తాజాగా ఈ చిత్రంను ఈనెల చివర్లోనే విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు..

'కల్కి' విడుదల విషయంలో ఏంటీ ఈ గందరగోళం-Kalki Release Date Confirm

ఉన్నట్లుండి సినిమా విడుదల తేదీ ప్రకటించడంతో గందరగోళ వాతావరణం కనిపిస్తుంది.

రీ షూట్‌ కోసం నిర్మాత మరియు హీరో పట్టుబడుతుంటే దర్శకుడు ప్రశాంత్‌ వర్మ మాత్రం సినిమా రీ షూట్‌ అవసరం లేదు అంటూ తేల్చి పారేశాడు. ప్రస్తుతం ఈ విషయమై చర్చ జరుగుతుంది.

పెద్ద ఎత్తున ఈ చిత్రంలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ సీన్స్‌ ఉన్నాయి. వాటిని రీ షూట్‌ చేసి, మళ్లీ విజువల్‌ ఎఫెక్ట్స్‌ చేయించాలంటే కనీసం 10 కోట్లకు పైగా అవ్వడంతో పాటు మూడు నెలల ఆలస్యం అవుతుంది. దాంతో దర్శకుడు సినిమాను ఇలాగే విడుదల చేయాలని భావిస్తున్నాడు.

నిర్మాణం ఎక్కువ అవుతుందనే టెన్షన్‌ అక్కర్లేదు అంటూ నిర్మాతలు చెబుతున్నా కూడా దర్శకుడు మాత్రం ఒప్పుకోకుండా సినిమా విడుదల తేదీని ప్రకటించాడట. దాంతో నిర్మాతలు మరియు హీరో రాజశేఖర్‌ దర్శకుడిపై ఆగ్రహంగా ఉన్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

మొత్తానికి రాజశేఖర్‌ కల్కి సినిమా అసలు విడుదల అవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 1980 నేపథ్యంలో రూపొందిన సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.