వైరల్‌ : ఏడాదిగా సాగుతున్న 'ఆవు' కేసుకు వింత తీర్పు... ఆవు ఇష్టానుసారం జడ్జ్‌ తీర్పు  

Jodhpur Animal Ownership Case Cow Chooses Owner-case Cow Chooses Owner,jodhpur,ఓం ప్రకాష్‌ మరియు శ్యామ్‌ సింగ్‌లు,రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌ కోర్టు

న్యాయ స్థానాల్లో కొన్ని కేసులు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఆ కేసు తీర్పు ఇచ్చేందుకు జడ్జ్‌లకు తల బొప్ప కడుతుంది. కొన్ని సార్లు జడ్జ్‌లు కూడా ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది..

వైరల్‌ : ఏడాదిగా సాగుతున్న 'ఆవు' కేసుకు వింత తీర్పు... ఆవు ఇష్టానుసారం జడ్జ్‌ తీర్పు-Jodhpur Animal Ownership Case Cow Chooses Owner

జడ్జ్‌లు తీసుకునే నిర్ణయాలపై కొన్ని సార్లు విమర్శలు కూడా వస్తూ ఉంటాయి. ఇండియన్‌ న్యాయ స్థానంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగవద్దనే ఉద్దేశ్యంతో చాలా ఆచి తూచి కేసుల విచరణ జరుపుతూ ఉంటారు. అలా ఒక ఆవు కేసు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ జడ్జ్‌గారి ముందుకు వచ్చింది.

ఆయన ఆ కేసును వింత పద్దతిలో పరిష్కరించి కొందరితో విమర్శలు మరి కొందరితో ప్రశంసలు దక్కించుకున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌ కోర్టులో గత ఏడాది కాలంగా ఒక ఆవుకు సంబంధించిన కేసు నడుస్తోంది. ఆ ఆవు తనది అంటే తనది అంటూ ఓం ప్రకాష్‌ మరియు శ్యామ్‌ సింగ్‌లు కోర్టులో పోరాడుతున్నారు. ఆ ఇద్దరు కూడా లాయర్లకు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసి మరీ ఆవు కోసం పోరాటం సాగించారు.

వారు చెబుతున్న వివరాల ప్రకారం ఆ ఆవు ఇద్దరిని అనిపిస్తుంది. దాంతో జడ్జ్‌ గత రెండు నెలలుగా ఏం చేయాలో పాలుపోక కేసును వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇక చివరగా ఏదో ఒక తీర్పు ఇవ్వాలని భావించి ఒక నిర్ణయానికి వచ్చాడు..

ఓం ప్రకాష్‌ మరియు శ్యామ్‌ సింగ్‌ల ఇంటికి కాస్త దూరంలో ఆవును వదిలేయడం జరిగింది. ఆ ఆవు ఎవరి ఇంటికి వెళ్తే వారిదే ఆ ఆవు అని నిర్ధారించాలని జడ్జ్‌ గారు నిర్ణయానికి వచ్చాడు. ఆవు తో పాటు జడ్జ్‌ కూడా ఆ ప్రాంతానికి వెళ్లారు.

అక్కడ ఆవును వదిలేయగా అది నేరుగా ఓం ప్రకాష్‌ ఇంటికి వెళ్లింది. దాంతో జడ్జ్‌ తుది తీర్పు ఇచ్చేశారు. ఆ ఆవు ఎలాంటి అనుమానం లేకుండా ఓం ప్రకాష్‌ ఆవు అని, శ్యామ్‌ సింగ్‌ ఆవుపై ఆశ వదులుకోవాలని తీర్పు ఇవ్వడం జరిగింది.

జడ్జ్‌ తీర్పుపై శ్యామ్‌ సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలా ఏంటీ అంటూ ఆక్రోశం వ్యక్తం చేశాడు. మూగ జీవానికి ఏం తెలుసు. దారిలో కనిపించిన ఇంటికి వెళ్లింది.

ఆవు నిర్ణయాన్ని బట్టి ఇలా తీర్పు ఇవ్వడం సరి కాదని, తాను పై కోర్టుకు వెళ్తానంటూ శ్యామ్‌ సింగ్‌ అన్నాడు. ఆవు ఓం ప్రకాష్‌దే అంటూ జడ్జ్‌ గారు ఇచ్చిన తీర్పు విషయంలో నెటిజన్స్‌ విమర్శలు చేస్తున్నారు.