ఏడోసారి కూడా అదే రిపీట్  

India Won The World Cup Match Against Pakistan-kohli,ms Dhoni,pakistan Cricket Team,rohith Sharma,world Cup

భారత్-దాయాది దేశం పాకిస్థాన్ ల మధ్య ఎంతో ప్రతిష్టాత్మకమైన సిరీస్ ప్రపంచ కప్ లో భారత్ ఏడోసారి కూడా పాక్ ని చిత్తుచేసింది. ఇప్పటివరకు ప్రపంచ కప్ లో పాల్గొన్న అన్నీ సార్లు కూడా భారత్ పాక్ పై విజయాన్ని అందుకుంటూనే ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ప్రపంచకప్ సిరీస్ లో భాగంగా 6 సార్లు విజయాన్ని అందుకున్న భారత్, ఏడోసారి కూడా అదే విజయాన్ని రిపీట్ చేసింది. ఈ మ్యాచ్ లో పాక్ చిత్తుచిత్తు గా ఓడింది..

ఏడోసారి కూడా అదే రిపీట్ -India Won The World Cup Match Against Pakistan

మాటల్లో కాదు చేతుల్లోనే మా సత్తా ఏంటో చూపుతాం అన్నట్లుగా భారత్ చాలా కూల్ గా పాక్ ని చిత్తు చిత్తు గా ఓడించింది. మాంచెస్టర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ 89 పరుగుల తేడా తో ఘనవిజయాన్ని నమోదు చేసింది. భారత బౌలర్ల ధాటికి పాక్ మరోసారి చతికిలపడింది. తొలుత టాస్ గెలిచి పాక్ ఫీల్డింగ్ ఎంచుకోవడం తో భారత్ తొలుత బ్యాటింగ్ కు దిగాల్సివచ్చింది.

అయితే వర్షం ఈ మ్యాచ్ కు అడ్డంకిగా మారుతుంది అని భావించినప్పటికీ వరుణుడు కూడా కరుణించడం తో ఈ మ్యాచ్ కొంతవరకు కొనసాగింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి భారత్ 336 పరుగులు చేసింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (140; 113 బంతుల్లో 14×4, 3×6) సూపర్‌ సెంచరీతోపాటు కోహ్లి (77; 65 బంతుల్లో 7×4), రాహుల్‌ (57; 78 బంతుల్లో 3×4, 2×6)లు అర్ధసెంచరీలు నమోదు చేశారు. కానీ హార్దిక్ పాండ్య (26), మహేంద్రసింగ్ ధోని (1) విజయ్ శంకర్ (15), కేదార్ జాదవ్ (9 ) ఆశించినంత మేరకు రాణించలేకపోయారు. పాక్ బౌలర్లలో మహ్మల్ అమీర్ మూడు వికెట్లు పడగొట్టగా. హసన్ అలీ, వాహబ్ రియాజ్ చెరో వికెట్ తీశారు. అయితే భారత బ్యాట్స్ మెన్స్ అందరూ కూడా క్యాచ్ లతోనే అవుట్ కావడం విశేషం. అనంతరం 337 పరుగుల విజయ లక్ష్యం తో బరిలోకి దిగిన పాక్ జట్టు ఆరంభంలోనే ఓపెనర్ ఇమామ్ ఉల్(7) వికెట్ కోల్పోయింది. అయితే ఫకార్ జమాన్(62),బాబర్ అజామ్ (48) లు కాస్త నిలకడగా ఆడడం తో రెండో వికెట్ కి 104 పరుగులు జోడించింది.

అయితే ఇక మైదానంలో పాతుకుపోతున్నారు అన్న సమయంలో కుల్దీప్ అద్భుతమైన బౌలింగ్ తో ఈ జోడి కి బ్రేక్ ఇచ్చి పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత హార్దిక్‌ పాండ్యా 27వ ఓవర్‌లో వరుస బంతుల్లో హఫీజ్‌ (9), షోయబ్‌ (0)లను అవుట్‌ చేయడంతో పాక్‌ 12 పరుగులు తేడాలో 4 కీలక వికెట్లను చేజార్చుకుంది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (12: 30 బంతుల్లో)ను విజయ్ శంకర్ క్లీన్‌ బౌల్డ్‌ చేయవడంతో పాక్ ఓటమి ఖాయమైంది. ఈ దశలో వర్షం పడడంతో మ్యాచ్‌ను 40 ఓవర్లకి కుదించి టార్గెట్‌ని 302 పరుగులుగా నిర్దేశించారు అంపైర్లు. చివర్లో ఇమాద్ వసీమ్ (46 నాటౌట్; 39 బంతుల్లో 6×4) చెలరేగినా పాక్‌కు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో కుల్దీప్‌, విజయశంకర్‌, పాండ్య చెరో 2 వికెట్లు తీయడం తో పాక్ చేతులు ఎత్తేయక తప్పలేదు. వర్షం కారణంగా DLS రూల్స్ ప్రకారం పాక్ 247 పరుగులు మాత్రమే చేయగలిగింది, అందుకే 89 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని డిక్లేర్ చేశారు