తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు ? బిజెపికి లాభం ఏంటి ?  

Increase The Assembly Seats In Telugu States-

బీజేపీ ఎత్తుగడలు ఇప్పుడు ఎవరికీ అర్థకాని రీతిలో ఉన్నాయి.దేశవ్యాప్తంగా బలహీనంగా ఉన్న రాష్ట్రాలపై దృష్టిపెట్టిన బీజేపీ అక్కడ బలపడేందుకు అన్ని దారులు వెతుక్కుంటోంది.దీనిలో భాగంగానే జమ్మూ కశ్మీర్‌, సిక్కిం,ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచేందుకు కేంద్రం ప్లాన్ వేస్తోంది...

Increase The Assembly Seats In Telugu States--Increase The Assembly Seats In Telugu States-

అందుకే ఈ నాలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ పూర్తి చేసి సీట్ల పెంపు చేయాలని చూస్తోంది.త్వరలో నాలుగు రాష్ట్రాలకు కలిపి ఒకే పునర్విభజన కమిషన్‌ను ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది.ఇప్పటికే దీనికి సంబందించిన బిల్లును కూడా రెడీ చేసినట్టు తెలుస్తోంది.

రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేయాలని చూస్తోంది.తెలుగు రాష్ట్రాల్లో బలపడడమే కాదు, అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ కి ఈ అవకాశం బాగా కలిసి వస్తుంది అన్న ఆలోచనలో ఉంది.

Increase The Assembly Seats In Telugu States--Increase The Assembly Seats In Telugu States-

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో నాయకుల వరుస చేరికలతో బీజేపీ బాగా బలపడుతుందన్న సంకేతాలు వస్తుండడంతో ఆ పార్టీలో మరింత ఉత్సాహం పెరిగింది.దీనికి తగ్గట్టుగానే బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఏపీలో 2024కి బీజేపీదే అధికారం అంటూ రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రతీ సారి చెబుతూ వస్తున్నాడు.ఏపీ ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్లు అయిందని, ప్రజల కష్టాలు బీజేపీ వల్లే తీరుతాయని చెబుతున్నారు.

బీజేపీ నాయకులంతా ఇప్పటికే టీడీపీకి వచ్చిన దుస్థితే వైసీపీకి కూడా వస్తుందని చెబుతూ వస్తున్నారు.ఈ మధ్య కాలంలో ఆ విమర్శలకు మరింత పదును పెట్టారు.ప్రస్తుతం బీజేపీ నాయకులు తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న రాజకీయ ప్రసంగాలు కూడా అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి...

ఇటువంటి పరిస్థితుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు ద్వారా బాగా బలపడగలమని బీజేపీ అంచనా వేస్తోంది.టీడీపీ నాయకత్వం బలహీనమైందని చెబుతూ ఆ పార్టీ నాయకులను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇక తెలంగాణలో నాలుగు పార్లమెంట్ సీట్లలో గెలిచిన ఉత్సాహంతో జాతీయవాద భావజాలంతో చాపకింద నీరులా విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది.

వచ్చే ఎన్నికలనాటికి బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో బాగా బలం పెంచుకుంటుంది అనే అంచనా బీజేపీ పెద్దల్లో బలంగా ఉంది.ఏపీలో మొన్నటివరకు జగన్ తో దోస్తీ చేసిన బీజేపీ ఇప్పుడు జగన్ మీద మత ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తోంది.క్రిస్టియన్ కోటరీ ఏర్పాటు చేసుకున్నారనే ప్రచారం మొదలవ్వడంతో కొంత మంది అధికారులను ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకోవాలనుకున్నప్పటికీ దానికి కేంద్రం మోకాలడ్డుతోంది.

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బలపడడమే ప్రధాన ధ్యేయంగా ముందుకు వెళ్తోంది.