సీరియల్‌ నటిని చితకొట్టించిన మేకప్‌ ఉమెన్‌.. అసలేం జరిగిందంటే  

Hair Dresses Jyothika Attack On Serial Actress Ragamadhuri-

పలు సీరియల్స్‌లో నటించి బుల్లి తెర ప్రేక్షకులకు సుపరిచితురాలైన రాగమాధురిపై ఆమె వద్ద కొంత కాలంగా పని చేస్తున్న హెయిర్‌ డ్రస్సర్‌ జ్యోతిక దాడి చేయించింది.తనను అన్యాయంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లేలా చేసిందనే కోపంతో రాగమాధురిపై జ్యోతిక తనకు చెందిన 10 మంది మగాళ్లతో దాడి చేయించింది.రాగమాధురి తనపై దాడితో పోలీసులకు ఫిర్యాదు చేసింది.పోలీస్‌ స్టేషన్‌లో ప్రస్తుతం రాగమాధురిపై దాడి చేసిన వారు ఉన్నారు.

Hair Dresses Jyothika Attack On Serial Actress Ragamadhuri--Hair Dresses Jyothika Attack On Serial Actress Ragamadhuri-

పూర్తి వివరాల్లోకి వెళ్తే… హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌నెం.13లోని లక్ష్మీపార్వతి నివాసం వద్ద ఒక సీరియల్‌ షూటింగ్‌ చిత్రీకరణ జరుగుతోంది.ఆ చిత్రీకరణలో రాగమాధురి పాల్గొంటుంది.రెండు రోజుల క్రితం ఆమెకు చెందిన బంగారు నల్లపూసల దండ కనిపించకుండా పోయింది.

Hair Dresses Jyothika Attack On Serial Actress Ragamadhuri--Hair Dresses Jyothika Attack On Serial Actress Ragamadhuri-

దాంతో ఆమె ఒక రోజంతా కూడా తన దండ కోసం యూనిట్‌ సభ్యులందరిని వాకబు చేసింది.అయితే అది దొరక్క పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.తన మేకప్‌ ఉమెన్‌ జ్యోతికపై అనుమానం ఉంది అంటూ ఫిర్యాదులో పేర్కొంది.దాంతో పోలీసులు జ్యోతికను అదుపులోకి తీసుకుని ఎంక్వౌరీ చేయడం మొదలు పెట్టారు.

ఆ సమయంలోనే నల్లపూసల దండ సెట్‌లోనే దొరికిందని పోలీసుల వద్దకు ఒక వ్యక్తి వచ్చి ఇవ్వడం జరిగింది.దాంతో జ్యోతికను వదిలేసి రాగ మాధురికి ఆ దండను ఇవ్వడం జరిగింది.అంతా అయిపోయిందని భావిస్తున్న తరుణంలో తనను పోలీసు స్టేషన్‌కు పంపించిన రాగ మాధురిపై కక్ష పెట్టుకున్న జ్యోతిక 10 మందిని తీసుకు వచ్చి దాడి చేయించింది.దాంతో రాగ మాధురి మళ్లీ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెను మరియు దాడి చేసిన వారిని అరెస్ట్‌ చేయడం జరిగింది.