గేట్ లో మంచి ర్యాంక్ వచ్చింది కానీ, వదులుకొని పకోడా వ్యాపారం

గేట్ ఎగ్జామ్ లో మంచి ర్యాంక్ సంపాదించిన విద్యార్థి దానికి భిన్నంగా తన జీవితాన్ని గడుపుతున్నాడు.ఈ ఘటన ఉత్తరా ఖండ్ లో చోటుచేసుకుంది.

 1gate Rank Holder Doing Pakoda Business-TeluguStop.com

సాగర్ షా అనే ఒక కుర్రాడు ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసి ఎంటెక్ కోసం అని గేట్ ఎగ్జామ్ ని రాశాడు.అయితే అందులో 8 వేల ర్యాంకు సంపాదించిన సాగర్ మరో రెండేళ్లు చదువు పేరుతో వృధా చేసుకోవడం ఇష్టం లేక ఇప్పుడు కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచాడు.

ఎంటెక్ పేరుతో మరో రెండేళ్లు కుటుంబానికి భారం కాకూడదు అని భావించిన సాగర్ తండ్రి వ్యాపారం అయిన పకోడా బిజినెస్ లో చేరి తండ్రికి చేదోడు వాదోడు గా నిలిచాడు.షాప్‌కు వచ్చే కస్టమర్లకు టీ, పకోడిలు సర్వ్‌ చేయడమే కాక ఏ మాత్రం మొహమాటపడకుండా పాత్రలను కూడా శుభ్రం చేస్తున్నాడు.

ఈ విషయం గురించి సాగర్‌ను ప్రశ్నించగా.గేట్ లో ర్యాంక్ సంపాదించడం కోసం ఎంతో శ్రమించాను.

స్వంతంగానే చదువుకున్నాను.గేట్‌లో 8 వేల ర్యాంక్‌ సాధించాను.

గేట్ లో మంచి ర్యాంక్ వచ్చింది

ఆ ర్యాంక్‌తో నాకు మంచి ఎన్‌ఐటీలోనే సీటు వస్తుంది.కానీ ఎంటెక్‌ పేరుతో మరో రెండేళ్ల సమయం వృధా చేయదల్చుకోలేదు.దాని బదులు ఏదో ఒక పని చేసి నా కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలనుకున్నాను.అందుకే మా పకోడా వ్యాపారంలో భాగస్వామినయ్యాన’ని సింపుల్ గా తెలిపాడు.అయితే ఈ పకోడా బిజినెస్ ను కూడా టెక్నాలజీతో అనుసంధానం చేసి మరింత స్మార్ట్‌గా ముందుకు తీసుకెళ్లాలన్నదే నా కోరిక అని అన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube