కోర్టు ప్రాంగణం లోనే గుండెపోటుకు గురైన ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు...మృతి  

Egypt\'s First Democratically-elected President Dies In Court-

ఈజిఫ్ట్ దేశ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ ముర్సీ హఠాన్మరణం పొందినట్లు తెలుస్తుంది.కోర్టు ప్రాంగణంలోనే ఆయన గుండె పోటు కు గురవ్వడం తో మృతి చెందినట్లు తెలుస్తుంది.కోర్టు లో విచారణ సందర్భంగా స్పృహ తప్పి పడిపోయారు.దానితో వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ చివరికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినల్టు తెలుస్తుంది.

Egypt\'s First Democratically-elected President Dies In Court--Egypt's First Democratically-elected President Dies In Court-

జడ్జి ముందు 20 నిముషాలు మాట్లాడిన ముర్సీ.క్రమేణా ఉద్రేకానికి గురై మూర్ఛబోయారు.ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు.అక్కడే ఆయన చనిపోయారు’’ అని న్యాయవర్గాలు వెల్లడించాయి.30 ఏళ్లపాటు ఈజిప్టును నిరంకుశంగా పరిపాలించిన హోస్ని ముబారక్‌ను 2011లో పదవీచ్యుతుణ్ని చేశాక, 2012లో ముర్సీ ప్రజాస్వామ్య పద్ధతిలో అధ్యక్షుడయ్యారు.

Egypt\'s First Democratically-elected President Dies In Court--Egypt's First Democratically-elected President Dies In Court-

2013లో సైన్యం ముర్సీని పదవీచ్యుతుడిని చేసి, ఆయన రక్షణమంత్రి అల్‌ సిసిని అధ్యక్షుడి పీఠంపై కూర్చోబెట్టింది.2012లో ముర్సీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈజిప్ట్ అధ్యక్షుడు అవ్వగా ఒక్క సంవత్సరంలోనే ఈ దేశ సైన్యం అతడిని దించేసి ముర్సీ రక్షణమంత్రి అల్ సిసిని అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టింది.గూఢచార్యం కేసులో అభియోగాలు ఎదుర్కొన్న ఆయన సోమవారం జడ్జి ముందు హాజరై, 20 నిమిషాల పాటు మాట్లాడి ఉద్రేకానికి గురై మూర్ఛపోవడం తో వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ కాసేపటికే తుది శ్వాస విడిచారు.