దగ్గర పడుతున్న నడిగర్ సంఘం ఎన్నికలు...విశాల్ పై కామెంట్స్ చేసిన సీనియర్ డైరెక్టర్  

Director Bharati Raja Sensational Comments On Vishal-

ఈ నెల 23 న తమిళనాట నడిగర్ సంఘం ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ ఎన్నికల్లో ఈ సారి కూడా పోటీ చేయనున్నట్లు నటుడు, నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న విశాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఈ ఎన్నికలు దగ్గర పడుతుండడం తో తమిళ నటులు విశాల్ ని టార్గెట్ చేస్తూ మాటలు తూటాలు పేలుస్తున్నారు.మొన్నటికి మొన్న నటుడు శరత్ కుమార్ కుమార్తె,నటి వరలక్ష్మి శరత్ కుమార్ నా ఓటును నువ్వు కోల్పోయావంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే...

Director Bharati Raja Sensational Comments On Vishal--Director Bharati Raja Sensational Comments On Vishal-

గతంలో నీకు ఫ్రెండ్ గా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు తాజాగా జగబోయే ఎన్నికల సమయంలో బయటపెట్టడం అనేది దిగజారుడు తనానికి నిదర్శన అని నా ఓటు హక్కును నీవు కోల్పోయావు అంటూ ట్వీట్ చేశారు.

Director Bharati Raja Sensational Comments On Vishal--Director Bharati Raja Sensational Comments On Vishal-

అయితే ఇంకా ఆ కామెంట్లు గురించి వివాదం ముగియక ముందే తాజగా సీనియర్ దర్సకుడు భారతీరాజా విశాల్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.తమిళనాడు నిర్మాత మండలిలో ఓ పందికొక్కు దూరిందంటూ ఆయన చేసిన కామెంట్.తమిళ సినీ పరిశ్రమలో దుమారం రేపుతోంది.అంతటితో ఆగకుండా అసలు తమిళ నటుల సంఘంలో ఇతర భాషల వాళ్లకు ప్రాధాన్యత ఏంటంటూ భారతీరాజా ప్రశ్నించడం విశేషం.తన ప్రాణం పోయేలోప తమిళనటుల సంఘాన్ని ఏర్పాటు చేస్తామని.

అందులో తమిళేతరులకు చోటు లేకుండా చూస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.