ప్రపంచ కప్ లో దూసుకెళుతున్న కోహ్లీ సేనకు బ్రేక్!  

Dhawan Out From The World Cup-

ప్రపంచ కప్ వరుసగా రెండు మ్యాచ్ లలో విజయం సాధించిన టీమిండియా కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.దక్షిణాఫ్రికా,ఆస్ట్రేలియా లపై వరుస విజయాలతో మంచి ఊపుమీద ఉన్న టీమిండియా ఇప్పుడు పెద్ద బ్రేక్ పడింది.

Dhawan Out From The World Cup--Dhawan Out From The World Cup-

టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ సిరీస్ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ లో ఊహించని విధంగా ధావన్ గాయం అయిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు ఆ గాయం కారణంగా ధావన్ సిరీస్ కు దూరం కానున్నాడు.

ఆస్ట్రేలియా తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో ధావన్ మునుపటి ఫామ్ ప్రదర్శించి సెంచరీ తో కదం తొక్కాడు.అయితే ఈ క్రమంలో బొటన వెలికి గాయం కావడం తో ఇప్పుడు ఆ గాయం కారణంగా ధావన్ సిరీస్ నుంచి వైదొలగాల్సి వచ్చింది.

దీనితో ధావన్ స్థానంలో ఓపెనర్ గా టీమిండియా మరో బ్యాట్స్ మెన్ కే ఎల్ రాహుల్ ఆడనున్నట్లు తెలుస్తుంది.అలానే టీమ్ లో ధవన్ స్థానాన్ని అంబటి రాయుడి తో భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఏది ఏమైనా ప్రపంచ కప్ లో మంచి ఊపు మీద ఉన్న కోహ్లీ సేనకు ఈ విధంగా బ్రేక్ పడింది అని చెప్పాలి.

అయితే జట్టులో ఉన్న మిగిలిన వారు రాణిస్తే ఇక భారత జట్టుకు ప్రపంచ కప్ లో తిరుగులేనట్లే అని చెప్పాలి.