కేసీఆర్ కి కౌంటర్ ఇచ్చిన రాములమ్మ! జగన్ చూసి నేర్చుకోవాలని సలహా  

జగన్ తో పోలుస్తూ కేసీఆర్ మీద విమర్శలు చేసిన విజయశాంతి. .

Congress Leader Vijayashanthi Compared Jagan And Kcr-

కాంగ్రెస్ పార్టీ మహిళా నేతగా తెలంగాణ రాజకీయాలలో తన ఉనికి చాటుకుంటున్న రాములమ్మ గతంలో తల్లి తెలంగాణ పార్టీ పెట్టి ఎన్నికల బరిలో నిలబడింది.అయితే రాములమ్మ తెలంగాణలో కీలక నేతగా ఎదగడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్న ఇప్పటి వరకు విజయం అందుకోలేకపోయింది.దీనికి ప్రధానం కారణం..

Congress Leader Vijayashanthi Compared Jagan And Kcr--Congress Leader Vijayashanthi Compared Jagan And KCR-

మొదట బీజేపీ పార్టీలో పని చేసిన రాములమ్మ తర్వాత తల్లి తెలంగాణ పార్టీ పెట్టి దానిని టీఆర్ఎస్ లో కలిపేసింది.అప్పట్లో కేసీఆర్ తో రాములమ్మ మంచి సన్నిహితంగా ఉండేది.అయితే మధ్యలో ఏమైందో ఇద్దరి మధ్య విభేదాలు పెరగడం ఆమె టీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ గూటికి రావడం జరిగింది.

ఇలా రాజకీయాలు మొదలెట్టినప్పటి నుంచి స్థిరత్వం లేకుండా పార్టీలు మారడం వలన ఆమెని బలమైన నాయకురాలుగా తెలంగాణ ప్రజలు గుర్తించడం మానేశారు.ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత విజయశాంతి సెలబ్రిటీ కాంపైనర్ గా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందు విస్తృతం ప్రచారం చేసిన కూడా తెలంగాణ ప్రజలు మళ్ళీ టీఆర్ఎస్ కి పట్టం కట్టారు.ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ నేతగా రాములమ్మ అవకాశం వచ్చిన ప్రతి సారి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద విమర్శన బాణాలు ఎక్కుపెడుతుంది.

తాజాగా మరో సారి ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో పోల్చుతూ కేసీఆర్ ని విజయశాంతి టార్గెట్ చేసింది.ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవి, హోం మంత్రి పదవి మహిళలకి ఇచ్చి వారికి గౌరవం కల్పించాడని, కాని తెలంగాణలో కేసేఆర్ కనీసం క్యాబినెట్ లో ఒక మంత్రి పదవి కూడా మహిళలకి ఇవ్వలేదని, ఈ విషయంలో జగన్ ని చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని విమర్శించారు.ఇప్పుడు ఈ విమర్శలు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిపోయాయి.