అనిల్ అంబానీ కి మరో సమస్య...బకాయిలు చెల్లించాలి అంటూ డిమాండ్ చేస్తున్న చైనా బ్యాంకులు  

Chinese Banks Demand $2.1 Billion From Tycoon Anil Ambani\'s Rcom-

ఇప్పటికే కుబేరుల జాబితా నుంచి పేరు వైదొలగిన అనిల్ అంబానీ కి ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది.ఆయన తమకు చెల్లించాల్సిన రుణాలను వెంటనే తీర్చేయాలని అంటూ చైనా బ్యాంకులు ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తుంది.సోమవారం ఆర్‌కామ్‌ కంపెనీ, రుణ దాతల జాబితాను విడుదల చేసింది...

Chinese Banks Demand .1 Billion From Tycoon Anil Ambani\'s Rcom--Chinese Banks Demand .1 Billion From Tycoon Anil Ambani's RCom-

చైనా డెవలప్‌మెంట్‌ బ్యాంకుకు రూ.9,860 కోట్లు, ఎక్సిమ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా కు రూ.3,360 కోట్లు, ఐసిబిసి కు రూ.1,554 కోట్లు చెల్లించాల్సి ఉంది.ఈ నేపథ్యంలో అప్పులు చెల్లించడానికి ఆర్‌కామ్‌ ఆస్తులను జియో కు విక్రయించేలా కుదుర్చుకున్న డీల్‌ కూడా లీగల్‌ సమస్యల వల్ల ఆగిపోవడం తో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఈ క్రమంలో మార్చిలో అనిల్‌ అంబానీ జైలు శిక్షను ఎదుర్కొనే పరిస్థితి రావడంతో ఆయన సోదరుడు ముఖేష్‌ అంబానీ రంగంలోకి దిగి 80 మిలియన్‌ డాలర్లను ఎరిక్సన్‌కు చెల్లించారు.

Chinese Banks Demand $2.1 Billion From Tycoon Anil Ambani\'s Rcom--Chinese Banks Demand $2.1 Billion From Tycoon Anil Ambani's RCom-

అయితే ఆ సమస్య నుంచి బయటపడ్డ అనిల్ కు ఇప్పుడు చైనా బ్యాంకులు ఒత్తిడి తీసుకురావడం పెద్ద తలనొప్పిగా మారింది.చైనాకు చెందిన పలు బ్యాంకులు ఆర్‌కాం బకాయిలకు సంబంధించి కనీసం 2.1 బిలియన్‌ డాలర్లు అప్పు చెల్లించాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నాయి.చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనా బ్యాంకులు అనిల్ ఆర్ కామ్ కంపెనీ కి పెద్ద మొత్తంలో రుణాలు అందించాయి.

అయితే ఇప్పుడు ఈ బకాయిలు చెల్లించాలి అంటూ అనిల్ పై ఒత్తిడి తీసుకురావడం తో ఆయనకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది.మరి ఇప్పుడు కూడా అన్న ముఖేష్ ఆదుకుంటారా లేక ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న అంశం తెలియాల్సి ఉంది