సీ ఎం జగన్ కాన్వాయ్ లో మార్పులు...కొత్తగా 6 బ్లాక్ ఫార్చ్యూనర్స్  

Changes In Ap Cm Jagan Convoy-hyderabad,jagan Convoy,jagan Governament,yv Subba Reddy,వైవీ సుబ్బారెడ్డి

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వాహనాల్లో మార్పు చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది. ఆయన కాన్వాయ్ లో కొత్తగా 6 నలుపు రంగు ఫార్చ్యూనర్ వాహనాలను ఏర్పాటు చేసినట్లు సీఎం భద్రతా అధికారులు వెల్లడించారు. AP39 PA 2345 నెంబర్‎తో కొత్త వాహన శ్రేణి ఉంటుందని భద్రతా అధికారులు తెలిపారు. ఈ క్రమంలో పాత కాన్వాయ్‎ను హైదరాబాద్ కు పంపించినట్లు తెలుస్తుంది. ఇటీవల సీఎం ఛాంబర్‌, కేబినెట్‌ హాల్‌, హెలిపాడ్, సీఎం కాన్వాయ్ రూట్‌లను ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు..

సీ ఎం జగన్ కాన్వాయ్ లో మార్పులు...కొత్తగా 6 బ్లాక్ ఫార్చ్యూనర్స్ -Changes In AP CM Jagan Convoy

అయితే ఇప్పుడు జగన్ కాన్వాయ్ లో వాహనాలను మార్చి కొత్త వాహనాలను అందించారు. జగన్‌ నేమ్‌ ప్లేట్‌ను కూడా సుబ్బారెడ్డి పరిశీలించి ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ కు పాత కార్లను పంపడం తో కొత్త ఫార్చ్యూన్ వాహనాలను జగన్ కాన్వాయ్ కోసం ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.

అయితే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అప్పుల్లో ఉందని, ఈ నేపథ్యంలో అన్ని ఖర్చులను తగ్గించుకుంటూ వస్తున్నా జగన్ సర్కార్ ఇప్పుడు నూతన కాన్వాయ్ లను ఎలా కొనుగోలు చేసింది అనేది అర్ధం కావడం లేదు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలకు కేటాయించిన గన్ మెన్ లను కుదించాలని ఆలోచన చేసిన జగన్ ఈ మేరకు నిర్ణయం కూడా తీసేసుకున్నారు. గత ప్రభుత్వం అనోసరంగా ఖర్చులు చేసింది కానీ మా ప్రభుత్వం అలా కాదు అంటూ తెగ కబుర్లు చెప్పిన జగన్ సర్కర్ ఇప్పుడు ఆయన కాన్వాయ్ కోసం బ్లాక్ కలర్ ఫార్చ్యూనర్స్ కొనడం గమనార్హం.