విదేశీ పర్యటనలో బాబు...అఖిలపక్ష సమావేశానికి గైర్హాజర్  

Chandrababu Naidu In Foreign Tour With Family-chandrababu,foreign Tour,prahaladh Joshi,tdp,with Family,టీడీపీ

ఏపీ మాజీ సీ ఎం చంద్రబాబు నాయుడు కుటుంబం తో విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తుంది. ఎన్నికల ఫలితాలు విడుదల అయిన తరువాతే ఈ పర్యటన ఉండాల్సి ఉండగా, ఓటమి పై విశ్లేషణలు చేసుకుంటూ ఇప్పటివరకు పొడిగించుకున్నారు. ఎన్నికల సమయంలో బిజీ షెడ్యూల్ తో గడిపిన టీడీపీ అధినేత కొంత విశ్రాంతి తీసుకోవాలని భావించి విదేశీ పర్యటన వెళ్లాలని అనుకున్నారు..

విదేశీ పర్యటనలో బాబు...అఖిలపక్ష సమావేశానికి గైర్హాజర్ -Chandrababu Naidu In Foreign Tour With Family

అయితే అప్పటి పార్టీ పరిస్థితుల నేపథ్యంలో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు తాజగా ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్నీ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కి ప్రత్యేక లేఖ కూడా రాసినట్లు తెలుస్తుంది.

కుటుంబం తో విదేశాలకు వెళుతున్నందున ఈ రోజు ఢిల్లీ లో జరగనున్న అఖిలపక్ష భేటీ కు ఆయన హాజరుకాలేకపోతున్నారు. విదేశీ పర్యటన ముందే ఖరారు కావడం తో ఈ సమావేశానికి హాజరు కావడం లేదని, ఈ సమావేశంపై తమ పార్టీ వైఖరి ఏంటి అన్న దానిపై కూడా ఆ లేఖ లో చంద్రబాబు వివరించినట్లు తెలుస్తుంది. ఈ నెల 24 వరకు బాబు తన కుటుంబం తో విదేశీ పర్యటన లోనే ఉండనున్నట్లు తెలుస్తుంది.

మరోపక్క ఈ అఖిల పక్ష సమావేశానికి ఏపీ సి ఎం వై ఎస్ జగన్, అలానే తెలంగాణా తరపున మంత్రి కేటీఆర్ హాజరుకానున్నట్లు తెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఏర్పాటు కానున్న ఈ అఖిలపక్ష సమావేశానికి పశ్చిమ బెంగాల్ సి ఎం మమతా బెనర్జీ కూడా దూరం కానున్నట్లు తెలుస్తుంది.

ఈ మేరకు ఆమె ప్రహ్లాద్ జోషి కి లేఖ కూడా రాసినట్లు తెలుస్తుంది. ఈ సమావేశానికి అన్నీ రాష్ట్రాల రాజకీయ పార్టీల అధినేతలు హాజరుకావాల్సి ఉంది. అయితే పలు కారణాల దృష్ట్యా కొందరు పార్టీ అధినేతలు ఈ సమావేశానికి హాజరు కాలేకపోవడం తో వారి కి బదులుగా పార్టీ కి చెందిన మరొకరి పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..