ఏపీలో కాంగ్రెస్ ని బ్రతికించే బాద్యత బాబుకి అప్పగించిన రాహుల్  

ఏపీలో కలిసి పనిచేసేందుకు సిద్ధం అవుతున్న రాహుల్ గాంధీ, చంద్రబాబు. .

Chanddrababu Ready To Work With Rahul Gandhi For Feature Ap-

ఏపీలో 40 ఏళ్ళ రాజకీయ ప్రస్తానంలో తెలుగు దేశం పార్టీ అధినేతగా ఆ పార్టీని ముందుండి నడిపించడమే కాకుండా హైదరాబాద్ మహానగరంపై ప్రపంచ ద్రుష్టి పడేలా చేయడంలో కీలక పాత్ర పోషించిన నేత చంద్రబాబు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి రెండు సార్లు, నవ్యాంధ్ర కి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసి ఏకంగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిగా తెలుగు రాష్ట్రల రాజకీయాలలో తిరుగులేని నాయకుడుగా చంద్రబాబు ప్రస్తానం నడిచింది.అయితే తాజా ఎన్నికలకి ముందు చంద్రబాబు ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం సంచలనంగా మారింది..

Chanddrababu Ready To Work With Rahul Gandhi For Feature Ap--Chanddrababu Ready To Work With Rahul Gandhi For Feature AP-

తెలుగు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన పాపంతో అంటించుకొని ప్రజల ఛీ కొట్టిన కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు తెలంగాణ ఎన్నికలలో, అలాగే దేశ రాజకీయాలలో జత కట్టడం తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకప్యారు.

అలాగే కాంగ్రెస్ వ్యతిరేఖ సిద్ధాంతాలతో ఏర్పడిన టీడీపీని నేరుగా కాంగ్రెస్ దగ్గరకి తీసుకెళ్ళడం తెలుగు దేశం పార్టీ శ్రేణులకి కూడా నచ్చలేదు.అయిన కూడా చంద్రబాబు తన పంథాలో వెళ్ళిపోయి తాజా ఎన్నికలలో ఊహించని విధంగా ప్రజల వ్యతిరేకతని పేస్ చేసాడు.కాంగ్రెస్ తో పాటు టీడీపీకి కూడా పాడే సిద్ధం చేసేసారు.

అయితే ఇప్పుడు బాబు ముందున్న తక్షణ కర్తవ్యం మళ్ళీ టీడీపీకి పునరుత్తేజం తీసుకురావడం.అయితే బాబు అలా చేయకుండా రాహుల్ తో కలిసి పని చేయడం ద్వారా భవిష్యత్తులో ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ కలిసి పనిచేసేందుకు అవకాశం ఇస్తున్నట్లు రాజకీయ వర్గాలలో టాక్ వినిపిస్తుంది.రాహుల్ కూడా బాబుకి కాంగ్రెస్ కి తిరిగి ప్రాణం పోసే బాద్యత అప్పగించాడని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.