అమెరికాలో మరణ శిక్ష అమలు నిర్ణయం..మొత్తం ఎంతమందో తెలుసా..!!!

అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.దాదాపు ఇరవై ఏళ్ల క్రితం అమలు కాబడిన మరణశిక్షలను మళ్లీ అమల్లోకి తీసుకురానుంది.

 1capital Punishmentin Us Attorneygeneral Issueorders-TeluguStop.com

ఈ మేరకు ట్రంప్ నేతృత్వంలో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.అత్యంత కిరాతకంగా నేరాలకు పాల్పడినవారికి మరణ దండన అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావించిన ప్రభుత్వం అందుకు సంభందించిన ఫైలు పై సంతకం చేసింది.

ఈ మేరకు అమెరికాలో ఐదుగురుకి మరణ శిక్ష విధించగా, వారికి ఈ శిక్ష ని జనవరిలో అమలు చేసే అవకాశం ఉందని అమెరికా అటార్నీ జనరల్ విలియం ప్రకటించారు.

కిరాతకమైన, నీచమైన నేరాలకు పాల్పడినవారికి మరణశిక్ష విధించాల్సిందే నని న్యాయశాఖ ఎప్పటినుంచో గత ప్రభుత్వాన్ని కోరింది.

చట్టాలు సరిగా అమలు అయ్యేలా న్యాయ విభాగం మొత్తం చూసుకుంటుందని, బాధితులకు వారి కుటుంబాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత న్యాయ విభాగం పై ఉందని అమెరికా అటార్నీ జనరల్ విలియం తెలిపారు.ఇప్పటికే జైళ్ల శాఖకు విలియం ఈ మేరకు ఆదేశాలను జారీ చేశారు.

అయితే

అమెరికాలో మరణశిక్ష అంటే మన దగ్గర విధించినట్లుగా ఉరిశిక్ష లా కాకుండా ఫెనో బార్బిటల్ అనే డ్రగ్ ని నేరస్తుడి శరీరంలో పంపించి, లెవెల్ ఇంజక్షన్ ఇచ్చి మరణ శిక్షను అమలు చేస్తారు.ఇదిలాఉంటే అమెరికా జైళ్ల శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, అమెరికా వ్యాప్తంగా మరణశిక్ష పడే అవకాశం ఉన్న ఖైదీలు దాదాపు 62 మంది ఉన్నారని తెలిపారు.

కానీ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమెరికా సెనేటర్, డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో నిలిచిన కమల హారీస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube