తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా చిన్నమ్మ సుష్మా స్వరాజ్ రానుందా  

తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా రానున్న సుష్మా స్వరాజ్. .

Bjp Senior Leader Sushma Swaraj Become A Governor To Telugu States-bjp,bjp Senior Leader Sushma Swaraj,governor To Telugu States,telangnana

తెలుగు రాష్ట్రాలలో బీజేపీ తన వ్యూహాలని అమలు చేయడం మొదలు పెట్టిందా అంటే అవుననే మాట వినిపిస్తుంది. సౌత్ ఇండియాలో ఒక్క కర్ణాటక తప్ప ఎక్కడ కూడా బీజేపీ పార్టీకి ప్రజల మద్దతు లేదు. నార్త్ ఇండియాలో బలం నిరూపించుకుంటూ మళ్ళీ అధికారంలోకి వచ్చిన బీజేపీకి పార్టీకి తెలుగు రాష్ట్రాల మీద ఆధిపత్యం చేలాయించాలనే చిరకాల కోరక అలాగే మిగిలిపోయింది..

తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా చిన్నమ్మ సుష్మా స్వరాజ్ రానుందా -BJP Senior Leader Sushma Swaraj Become A Governor To Telugu States

ఏపీ, తెలంగాణలో బీజేపీ పార్టీకి కనీసం సెకండ్ ఛాయస్ కూడా ప్రజలు చూడరు. ఆ పార్టీ తరుపున ఎవరు పోటీ చేసిన కేవలం స్వంత బలంతో తప్ప పార్టీ బలంతో గెలిచిన సందర్భాలు చాలా తక్కువ. తాజాగా జరిగిన ఏపీ ఎన్నికలలో అయితే బీజేపీ పార్టీ తరుపున పోటీ చేసిన అభ్యర్ధులు ఎవరు అనేది కూడా చాలా మందికి తెలియదు.

తెలంగాణలో అయితే కొంతలో కొంత పర్వాలేదు అని చెప్పాలి. ఇక్కడ బలమైన క్యాడర్ లేకపోయినా బలమైన నేతలు ఉన్నారు.ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాలపై పట్టు పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ ఇప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో విదేశాంగ శాఖ మంత్రిగా పని చేసిన బీజేపీ సీనియర్ సుష్మా స్వరాజ్ తాజా ఎన్నికలలో దూరంగా ఉన్నారు. బలమైన నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమెని తెలుగు రాష్ట్రాలకి గవర్నర్ గా పంపించడం ద్వారా ఇక్కడ తమ ఆధిపత్యం చూపించి, ప్రజలని ఆకట్టుకొని బలమైన శక్తిగా మారాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. దీనికి బీజేపీ చీఫ్ అమిత్ షా, ప్రధాని మోడీ పక్కా ప్లాన్ ప్రకారం ఆమెని పోటీకి దూరంగా ఉంచి గవర్నర్ గా పంపించి సౌత్ లో స్ట్రాంగ్ గా పాగా వేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

మరి ఈ వార్తలలో నిజం ఎంత అనేది తెలియాలంటే కొద్ది రోజ్జులు వేచి చూడాల్సిందే.